ముఖ్యమంత్రా లేదా మెడికల్ స్టూడెంట్,రామ్ చరణ్ ఎవరు ?
Z
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రేజ్ తో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రేజ్ తో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే... భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ సినిమాలో రామ్ చరణ్ సీఎం గా కనిపించబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC15 సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అని.. శంకర్ ఈ సినిమాని ఒకే ఒక్కడు మూవీ తరహాలో తెరక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ .. ఓ జర్నలిస్ట్ ఒక్క రోజు సీఎం గా ఉంటే.. రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదాన్ని సినిమాగా చూపించిన శంకర్ ఈసారి రామ్ చరణ్ ని అలాంటి పాత్రలో చూపించబోతున్నారట.
ఈ సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ గా కియారా అద్వానీతో సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే... మరో వార్త కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ కథ ఉంటుందని మరో టాక్. మరి మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్ ఎలా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే రామ్‌చరణ్ నేరుగా శంకర్ క్యాంపులో చేరిపోతారని టాక్. మరోవైపు శంకర్ ‘భారతీయుడు2’ ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వీలైనంత త్వరగా చరణ్ సినిమాను మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య కనిపించబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు శంకర్ పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్ళిపోతారట.