ఎక్కువ బడ్జెట్ సెట్స్ కు,  VFX వర్క్ కు అయ్యిందని అంటున్నారు. టైమ్ మిషీన్ సెట్, బుజ్జి వెహికల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసారు. 


 ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటింజచిన ఈ చిత్రం రిలీజ్ కు ఎక్కువ సమయం లేదు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టి ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కు దాదాపు 700 కోట్లు దాకా పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. అందులో వంద కోట్లు కేవలం ప్రభాస్ కే రెమ్యునరేషన్ గా ఇచ్చారని చెప్తున్నారు. అమితాబ్ కు, దీపికా పదుకోని కు తలో పది కోట్లు ఇచ్చారట. ఇక కమల్ హాసన్ కు డైలీ బేసిస్ మీద ఇచ్చినా 50 కోట్లు అయ్యిందని వినికిడి. అలాగే ఈ సినిమాకు ఎక్కువ బడ్జెట్ సెట్స్ కు, VFX వర్క్ కు అయ్యిందని అంటున్నారు. టైమ్ మిషీన్ సెట్, బుజ్జి వెహికల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసారు. 

ఈ మూవీలో ప్రభాస్ వాడిన కారు పేరు బుజ్జి. ఈ బుజ్జికి కీర్తీ సురేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేషన్‌ ప్రెల్యూడ్‌ వీడియోను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఓకే బుజ్జి.. వీళ్లకి సర్‌ప్రైజ్‌ చూపించేద్దామా?’ (ప్రభాస్‌), ‘ఓకే భైరవ..’ (వాయిస్‌ ఓవర్‌తో బుజ్జి) వంటి డైలాగ్స్‌ ఈ టీజర్‌లో ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ వీడియో స్ట్రీమింగ్‌ కానుంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని వివిధ పాత్రల పరిచయంతో ఈ వీడియో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: సంతోష్‌ నారాయణన్