జూలై 21న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వివేక్ కూచిబొట్ల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తెలియచేసారు. 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర అవుతూండటంతో ఇంకా ప్రమోషన్స్ స్పీడు పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా అందరూ బ్రో చిత్రం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అప్ డేట్ వచ్చేసింది. జులై 21వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు.

జూలై 21న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వివేక్ కూచిబొట్ల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తెలియచేసారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక విషయమే ఇంకా క్లారిటీ రాలేదు. ఎక్కడ .ఎప్పుడు జరపాలి అనే విషయమై మేకర్స్ తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా జూలై 24న అనుకున్నా.. పవన్ వారాహితో బిజీగా ఉండటంతో అదే డేట్ ఫిక్స్ అని కన్ఫర్ చేయలేకపోతున్నారు. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్డేట్ కోసమే అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారటంలో సందేహం లేదు.

సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క నైజామ్ హక్కులే మైత్రికి ముప్పై రెండు కోట్లకు అమ్మారని అంటున్నారు. అదే నిజమే అయితే మిగతా ఏరియాలు కూడా ఏ రేంజ్ లో అమ్మి ఉంటారా అని అనిపిస్తుంది. దాంతో ట్రేడ్ లో ఈ సినిమాపై క్రేజ్ ఉందో అర్దమవుతోంది.