అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి  సీక్వెల్ రెడీ అవుతోంది.    ‘మన్మథుడు 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజ్ కు రెడీ అవుతోంది.  రిలీజ్ ఫోస్ట్ ఫోన్ అవుతుందేమో అనే రూమర్స్ కు చెక్ చెప్తూ యూనిట్ ఆల్రెడీ అనుకున్న టైమ్ కే వస్తామని ప్రకటన చేసింది. అంటే దాదాపు ఓ నెల మాత్రమే టైమ్ ఉంది.  అయితే విచిత్రం ఏమిటంటే ఆ సినిమా యూనిట్ ఇప్పటిదాకా ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రారంభించకపోవటం. 

ఈ సినిమాకు సంభందించిన మేజర్ ఈవెంట్ కూడా ఏదీ ఇప్పటిదాకా ప్లాన్ చేసయలేదు. దాంతో మూవీ ప్రమోషన్ పరిస్దితి ఏమిటి...రిలీజ్ అనుకున్న టైమ్ కు చేస్తారా అనే సందేహాలు మీడియాకే కాదు అభిమానులుకు సైతం కలుగుతున్నాయి.  దీనికి తోడు నాగార్జున బిగ్ బాస్ 3 లో బిజీ అవుతున్నారు. ఈ షో జూలై 21 నుంచి ప్రారంభం కానుంది. మరి ఇప్పటికైనా టీమ్ మేల్కొని ప్రమోషన్స్ పై దృష్టి పెట్టి, ఈ నెల ఈ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తే బెస్ట్ అంటున్నారు. లేకపోతే ఓ వారం ముందో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఓ ట్రైలర్ వదిలేసి థియోటర్ లోకి వెళ్తే బజ్ క్రియేట్ కావటం కష్టం అని చెప్తున్నారు. 

ఇక  ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ లో నాగ్‌ ని చూసిన వారంతా నవ మన్మధుడు అంటున్నారు. అసలు ఆయన వయస్సు కనపడటం లేదని చెప్తున్నారు.  నాగ్, రకుల్‌ జంట చక్కగా కనిపించింది.   మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   రకుల్‌ప్రీత్‌ సింగ్, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్స్ .