ఏ పొలిటికల్ పార్టీ పై ఆ సెటైర్ డైలాగులు? బన్నీవాసు మనస్సలో ఏముందో
నాయాట్టు' #Nayattu అనే సినిమాని తెలుగులో 'కోట బొమ్మాళి పిఎస్' #KotabommaliPS పేరుతో రీమేక్ తీసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎలక్షన్స్ దగ్గరపడుతున్నాయి. గతంలో ఈ సీజన్ లో పొలిటికల్ సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు ఉన్న సినిమాల్లోనే పొలిటికల్ యాంగిల్ కలిపి వదులుతున్నారు. కొందరు చెప్పి చేస్తున్నారు. మరికొందరు సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఫలానా పొలిటికల్ డైలాగు ..ఫలానా పార్టీని ఉద్దేసించిందే అనే టాక్ మొదలవుతోంది. ఒక్కోసారి...ఈ టాక్ వలన కలెక్షన్స్ కు ప్లస్ అవుతోంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో పృధ్వీ ట్రాక్...డైరక్ట్ గా అంబటి రాంబాబు ని ఉద్దేశించిందే అని అర్దమై పెద్ద రచ్చ జరిగింది. ఓ రకంగా అది సినిమా కలెక్షన్స్ కు ఉపయోగపడింది. ఇప్పుడు అలాంటి 'కోట బొమ్మాళి పిఎస్' #KotabommaliPS సినిమా కు అలా జరగబోతోందా అనిపిస్తోంది నిర్మాత బన్నీ వాసు మాటలు వింటూంటే..
గీతా ఆర్ట్స్ 2 (GeethaArts2) సంస్థ అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ వస్తోంది. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' #GeethaGovindam, 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటివి నిర్మించి సూపర్ హిట్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయాట్టు' #Nayattu అనే సినిమాని తెలుగులో 'కోట బొమ్మాళి పిఎస్' #KotabommaliPS పేరుతో రీమేక్ తీసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్ (BunnyVasu), విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా మీడియాతో మాట్లాడారు బన్నీ వాసు.
బన్నీ వాసు మాట్లాడుతూ.... ఈ సినిమా ఓవరాల్ గా ఉండే పొలిటికల్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైనా భుజాలు తడుముకుంటే నాకు సంభందం లేదు. ఇది ఒక పార్టీ అని కాదు. ఎవరైనా ఎక్కువ రియాక్ట్ అయితే వాళ్లు ప్రత్యక్ష్యంగా అనుభవం ఉండి ఉంటే వాళ్లు రియాక్ట్ కావచ్చు. మేము ఓ సింగిల్ పార్టీని టార్గెట్ చేయటం లేదు, ఇందులో కొన్ని సీన్స్ కొంతమంది పొలిటీషన్స్ కూడా తగలచ్చు.అది చాలా పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైర్ అయ్యి రాసారు డైలాగులు..అలాగే కొంతమందికి ఫట్ అని కొట్టినట్లుంది అని చెప్పుకొచ్చారు.
అలాగే ‘‘ఇది మలయాళ సినిమా నాయట్టు రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు. ఆ చిత్రంలోని రెండు సన్నివేశాలను స్ఫూర్తి తీసుకున్నామంతే. అందులోని పాత్రలు, ‘కోట బొమ్మాళి’లోని పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పక్కా తెలుగు కమర్షియల్ సినిమా. నాయట్టు.. ఓ అద్భుతం. దాన్ని రీ క్రియేట్ చేయాలని మేం అనుకోలేదు. అక్టోబరు 13 లేదా నవంబరు 24న ఈ సినిమాని విడుదల చేయానుకుంటున్నాం. కాపీ సిద్ధమైన సమయాన్ని బట్టి వాటిల్లో ఏదోక డేట్ ఫిక్స్ చేస్తాం’’ అని అన్నారు. ‘రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున రంగంలోకి దిగుతారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే తప్పకుండా వస్తా’’ అని సమాధానమిచ్చారు.
గీతా ఆర్ట్స్ 2 పతాకంపై తాను నిర్మిస్తున్న ‘కోట బొమ్మాళి పి.ఎస్’ (Kotabommali PS).. మలయాళ హిట్ చిత్రం ‘నాయట్టు’ (Nayattu)కు రీమేక్ కాదని నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) స్పష్టం చేశారు. ఈ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ దక్కడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ వేడుకలోనే.. ‘కోట బొమ్మాళి’ రీమేక్ అంటూ వస్తున్న రూమర్స్‌పై ఆయన స్పందించారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు.