Asianet News TeluguAsianet News Telugu

Devisri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీకి సల్మాన్ ఝలక్... క్రేజీ ప్రాజెక్ట్ నుండి అవుట్!

రాక్ స్టార్ దేవిశ్రీ టైం ఏం బాలేదు. ఆయన రేసులో వెనుకబడ్డారు. తాజాగా బడా బాలీవుడ్ ప్రాజెక్ట్ చేజారినట్లు సమాచారం అందుతుంది. సల్మాన్ ఖాన్  దేవిశ్రీ ట్యూన్స్ నచ్చలేదన్నారట.

was salman khan opted out devisri from kabi eid kabi divali movie
Author
Hyderabad, First Published Jun 30, 2022, 9:04 AM IST


ఒకప్పుడు దేవిశ్రీ (Devisri Prasad)టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. కొరటాల శివ, త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులు దేవిశ్రీ ట్యూన్స్ కోరుకునేవారు. అజ్ఞాతవాసి చిత్రం నుండి త్రివిక్రమ్ దేవిశ్రీకి ఆఫర్ ఇవ్వడం లేదు. ఇక కొరటాల శివ కెరీర్ బిగినింగ్ నుండి దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఆచార్య విషయానికి వచ్చేసరికి మార్చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి అనిరుధ్ ని ఎంచుకున్నారు. దేవిశ్రీ చేతిలో ఉన్న ఒకే ఒక స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రమే. సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు. 

ఓ దశలో వెనకబడ్డ థమన్(SS Thaman) రేసులో దూసుకొచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ ఆయనదే. థమన్ కి దేవిశ్రీ పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో దేవిశ్రీ కొంత ఒత్తిడికి గురవుతున్నారన్న సమాచారం అందుతుంది. ఆ కారణంగానే గతంలో మాదిరి ఆయన మంచి ట్యూన్స్ ఇవ్వలేకున్నాడు. తాజాగా ఆయనకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ షాక్ ఇచ్చారట. ఆయన లేటెస్ట్ మూవీ కబీ ఈద్ కబీ దివాళి చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీని ఎంపిక చేశారు. 

అయితే దేవిశ్రీ అందించిన ట్యూన్స్ పట్ల సల్మాన్ (Salman Khan)అసంతృప్తి వ్యక్తం చేశారట. కబీ ఈద్ కబీ దివాళి ప్రాజెక్ట్ నుండి దేవీశ్రీని తప్పించి కెజిఎఫ్ ఫేమ్ రవి బసృర్ ని ఎంచుకున్నారట. ఆయన అందించిన టైటిల్ ట్రాక్ కూడా సల్మాన్ కి బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. నిజానికి గతంలో దేవిశ్రీ అల్లు అర్జున్ కోసం కంపోజ్ చేసిన రింగా రింగా, సిటీ మార్ సిటీ మార్ సాంగ్స్ ట్యూన్స్ సల్మాన్ తన చిత్రాల్లో వాడుకున్నారు. 

ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో పూజా హెగ్డే, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఓ సాంగ్ లో రామ్ చరణ్, పూజ, సల్మాన్, వెంకీ స్టెప్స్ వేయనున్నారట. ఇక సల్మాన్ చిరంజీవి (Chiranjeevi)గాడ్ ఫాదర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య సౌత్ స్టార్ట్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios