బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల 'సూపర్ 30' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'వార్' అంటూ మరో సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి వచ్చాడు. ఇందులో మరో హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు.

ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు విడుదలైనప్పుడు ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో పోటీ పడుతూ తెలుగులోనూ విడుదలైంది.

ఈ సినిమాకి మొదటి రోజే రూ.45 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమాకు వస్తున్న టాక్‌ను బట్టి చూస్తే ఆ వసూళ్ల అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. సినిమా చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు.

సస్పెన్స్ తో సినిమాను మొదలుపెట్టి బాగా డీల్ చేశారని.. సినిమాకి హృతిక్, టైగర్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచారని అంటున్నారు. ఇటీవల టైగర్ ష్రాఫ్ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా ఫెయిల్ కావడంతో టైగర్ 'వార్' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ట్విట్టర్ రివ్యూలను బట్టి చూస్తోంటే టైగర్ హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు!