Asianet News TeluguAsianet News Telugu

శతాధిక చిత్రాల దర్శకుడి పరువు ఒక్క చిత్రంతో పోయింది... అయ్యో దర్శకేంద్రా నీకు అవసరమా!


 వాంటెడ్ పండుగాడ్ సినిమాతో దర్శకేంద్రుడు పరువు పోగొట్టుకున్నాడన్న మాట వినిపిస్తుంది. అంత సీనియర్ డైరెక్టర్ ఇలాంటి సిల్లీ సినిమాకు సమర్పకుడిగా ఉండడమేంటని అందరూ పెదవి విరుస్తున్నారు. 

wanted pandugod movie damages k raghavendrarao image in a big time
Author
First Published Aug 21, 2022, 7:24 PM IST

ఆగస్టు 19న వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. పండుగాడ్ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అసలు థియేటర్స్ నుండి ప్రేక్షకులు మధ్యలోనే వచ్చేస్తున్నారన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. లెక్కకు మించిన కమెడియన్స్ తో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ వరస్ట్ మూవీగా ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు. కథ, కథనం లేకుండా నవ్వు తెప్పించలేని కామెడీ ట్రాక్స్ తో సినిమా మొత్తం నింపేసారని అంటున్నారు. అసలు తలా తోకా లేకుండా తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ థియేటర్స్ వైపు వెళ్లడం కూడా ప్రమాదమే అన్న మాట వినిపిస్తుంది. 

దర్శకుడు శ్రీధర్ సీపాన తెరకెక్కించిన ఈ అవుట్ డేటెడ్ కామెడీ డ్రామా రెండో రోజే థియేటర్స్ నుండి తీసేసే పరిస్థితి నెలకొంది. కొత్త దర్శకుడు శ్రీదర్ సీపన గురించి ఎవరూ మాట్లాడు కోవడం లేదు. ఎందుకంటే ఈ చిత్ర సమర్పకుడిగా రాఘవేంద్రరావు ఉన్నారు. అంత సీనియర్ దర్శకుడి పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ ఇంత దారుణంగా ఉండడమేమిటి అంటున్నారు. 

అందులోనూ ఇదేదో కళాఖండం అయినట్లు రాఘవేంద్రరావు దగ్గరుండి ప్రమోట్ చేశాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో విరివిగా పాల్గొన్నారు. తీరా సినిమా చూశాక జబర్దస్త్ కామెడీ షోనే బెటర్ అన్న వాదన వినిపించింది. ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మూవీ తెరకెక్కించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వాంటెడ్ పండుగాడ్ సమర్పకుడిగా ఉండి, రాఘవేంద్రరావు పరువు పోగొట్టుకున్నారని అందరూ అంటున్నారు. అనేక ఇండస్ట్రీ హిట్స్ తెరకెక్కించిన ఈ శతాధిక చిత్రాల దర్శకుడు ఇలాంటి చిల్లర చిత్రాల దూరంగా ఉండి పరువు కాపాడుకుంటే బెటర్ అన్నమాట వినిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios