Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి తాగా అందిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంతకీ ఎంత కలెక్ట్ చేసిందంటే..
 

Waltair Veerayya, Waltair Veerayya first day collections
Author
First Published Jan 14, 2023, 7:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా కొనసాగుతోంది. అయితే, తొలిరోజు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. 

‘గాడ్ ఫాదర్’ తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పలు నివేదికలను వెల్లడించారు. వాటి ఆధారంగా.. ‘వాల్తేరు వీరయ్య’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు రిపోర్టులు తెలుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల షేర్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి సమచారం. 

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి...
- నైజాం : రూ. 6.10 కోట్లు
- సీడెడ్  : రూ.4.20  కోట్లు
- యూఏ  : రూ. 2.57 కోట్లు 
- తూర్పు : రూ.2.68 కోట్లు 
- పశ్చిమ : రూ. 2.06  కోట్లు 
- గుంటూరు : రూ.2.75 కోట్లు 
- కృష్ణ : రూ. 1.49 కోట్లు
- నెల్లూరు: రూ.1.05 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభంతో స్టార్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ 30 శాతానికి పైగా రికవరీని సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం రూ.88 కోట్లు అయినట్టు సమాచారం. రూ.89 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని తెలుస్తోంది. 

మరోవైపు యూఎస్ఏలోనూ వాల్తేరు వీరయ్యకు మాస్ రెస్పాన్స్ దక్కుతోంది. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే మైల్ స్టోన్ రీచ్ అయ్యినట్టు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే 1 మిలియన్ డాలర్స్ కు పైగా వసూల్ చేసి వీరయ్య సత్తా చాటరని తెలిపారు. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ మెగా బ్లాక్ బాస్టర్ గా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోందని అర్థమవుతోంది. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి భారీ కలెక్షన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios