Asianet News TeluguAsianet News Telugu

`వాల్తేర్‌ వీరయ్య` కలెక్షన్ల సునామీ.. కాలర్ ఎగరేస్తున్న మెగా ఫ్యాన్స్.. చురకలు తప్పడం లేదుగా!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదికి గొప్ప శుభారంభాన్నిచ్చింది.

waltair veerayya total 10 days collections create new record mega fans full kushi but
Author
First Published Jan 23, 2023, 10:43 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లని సాధించింది. తాజాగా మరో మైలు రాయికి చేరుకుంది. ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిరు రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్‌ 150` రూ150కోట్లు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా దాన్ని అదిగమించింది. ఇది పది రోజుల్లో ఏకంగా రెండు వందల కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్‌ చేసింది. 

ఈ ఏడాదికి గొప్ప శుభారంభాన్నిచ్చింది. 2023లో ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తెలుగు మూవీగా రికార్డు క్రియేట్‌ చేసింది. దాదాపు రూ.130కోట్లకుపైగా షేర్‌ని సాధించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 10 మూవీస్‌లో ఈ చిత్రం చోటు సంపాదించుకోవడం విశేషం. అంతేకాదు కలెక్షన్ల రికార్డుల్లోకి చిరు చేరిపోయారు. 

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవితోపాటు రవితేజ కీలక పాత్ర పోషించారు. చిరుకి తమ్ముడిగా, పోలీస్‌ ఆఫీసర్‌గా మాస్‌ మహారాజా నటించారు. చిరంజీవికి జోడీగా శృతి హాసన్‌ నటించగా, రవితేజకి కేథరిన్‌ నటించింది. బాబీ సింహా, ప్రకాష్‌ రాజ్‌ విలన్‌ పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇదే బ్యానర్‌లో తెరకెక్కిన బాలయ్య సినిమా `వీరసింహారెడ్డి` కూడా సంక్రాంతికి విడుదలైన విసయం తెలిసిందే. కానీ అది `వాల్తేర్‌ వీరయ్య`తో పోటీ పడి వెనకబడిపోయింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు 70కోట్ల షేర్‌ సాధించింది. 

ఇక సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన `వాల్తేర్‌ వీరయ్య`తో చిరంజీవికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా రెండు వందల కోట్ల పోస్టర్‌ని టీమ్‌ విడుదల చేయడంతో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు. బాస్‌ లకే బాసు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని చిరు చెప్పిన డైలాగ్‌లు మీమ్స్ లో వేసుకుని ట్రెండ్‌ చేస్తున్నారు. మెగా రేంజ్‌కిది నిదర్శనం అంటూ కాలర్‌ ఎగరేస్తున్నారు. 

ఇదిలా ఉంటే మరోవైపు ఈ కలెక్షన్ల విషయంలో కొంత నెగటివ్‌ టాక్‌ కూడా వినిపిస్తుంది. మొక్కుబడిగా కలెక్షన్లని ప్రకటించినట్టుగా ఉందని, ఈ లెక్కలంతా ఫేక్‌ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా వాస్తవంగా టీమ్‌ ప్రకటించిన దానికంటే ముప్పై, నలభై కోట్లు తక్కువగానే వసూలు చేసిందని, ప్రచార ఆర్భాటం కోసం క్రియేట్‌ చేయబడ్డ ఫేక్‌ కలెక్షన్లు అంటూ కామెంట్ల రూపంలో చురకలంటిస్తున్నారు కొందరు నెటిజన్లు. 

ఇదిలా ఉంటే ఈసినిమా కి వచ్చిన రివ్యూ, రేటింగ్‌ల విషయంలో చిరంజీవి సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే. కొన్నిసైట్స్  2.25 రేటింగ్‌ ఇచ్చాయని, కానీ తనకు సినిమాపై నమ్మకం ఉందని, ఇది పెద్ద రేంజ్‌కి వెళ్తుందని ఊహించినని, అందుకే రేటింగ్‌ని పట్టించుకోవద్దని టీమ్‌కి చెప్పినట్టు తెలిపారు. అయితే 2.25 రేటింగ్‌ నిజమే అని, అయితే అది యూఎస్‌ కలెక్షన్లనే విషయం తెలుసుకోలేకపోయానంటూ సెటైర్లు విసిరారు చిరంజీవి. 

Follow Us:
Download App:
  • android
  • ios