వాల్తేరు వీరయ్య నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైంది. చిరంజీవి ఫ్యాన్స్ మూవీ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్య డిజిటల్ రైట్స్ సమాచారం అందుతుంది.
జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదలైంది. మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి అంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ కి వాల్తేరు వీరయ్య పర్ఫెక్ట్ ట్రీట్ అన్నమాట వినిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ దర్శకుడు అదరగొట్టాడు అంటున్నారు. సెకండాఫ్, క్లైమాక్స్ మీద శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ఆసక్తిగా మలచి ఉంటే సినిమా ఫలితం వేరుగా ఉండేదని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.
ఇక రవితేజ సెకండ్ హాఫ్ కి ప్లస్ అయ్యారట. ఆయతో చిరంజీవి ముఖాముఖి సన్నివేశాలు, ఎమోషనల్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి అంటున్నారు. మొత్తంగా మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలున్న వాల్తేరు వీరయ్య మెగా ఫ్యాన్స్ కి నచ్చుతుంది అంటున్నారు. కాగా వాల్తేరు వీరయ్య డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ ధర చెల్లించి వాల్తేరు వీరయ్య హక్కులు దక్కించుకున్నారు.
నెట్ఫ్లిక్స్ చందాదారులు మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య బుల్లితెరపై ఎంజాయ్ చేయనున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా నాలుగు వారాల్లో ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. కాబట్టి వాల్తేరు వీరయ్య ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలో స్టీమ్ అయ్యే అవకాశం కలదు.
వాల్తేరు వీరయ్య చిత్రానికి కే ఎస్ రవీంద్ర దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా నటించారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో చిరంజీవి బాలయ్య వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు చిత్రాలతో పోటీపడుతున్నారు. వీరసింహారెడ్డి, తెగింపు సైతం యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. వారసుడు తమిళ వర్షన్ వారిసు కూడా యావరేజ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలో సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారనే సందిగ్ధత కొనసాగుతుంది.
