వివి వినాయక్ తొలిసారి వెండితెరపై హీరోగా కనిపించేందుకు సిద్ధం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇది వరకే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సోసియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. వివి వినాయక్ హీరోగా కనిపించే ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

వివి వినాయక్ స్టార్ డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ అందరికి పరిచయం. డైరెక్టర్స్ కి లుక్ తో పనిలేదు. కానీ ఇప్పుడు ఈ సీనియర్ దర్శకుడు జిమ్ లో కష్టపడుతూ తన గెటప్ మార్చుకునే పనిలో ఉన్నాడు. తాజాగా బయటకు వచ్చిన వినాయక్ జిమ్ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

వివి వినాయక్ ప్రస్తుతం బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు  కానీ ఈ చిత్రాన్ని నరసింహా రావు పవర్ ఫుల్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వినాయక్ ఇదివరకే ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. తొలిసారి పూర్తి స్థాయిలో నటించబోతున్న ఈ దర్శకుడు ఎలా మెప్పిస్తాడా వేచి చూడాలి.