Asianet News TeluguAsianet News Telugu

రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా! డైరక్టర్ ఎవరంటే..

తనికెళ్ళ భరణి  దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో మరో చిత్రానికి రంగం సిద్దం అవుతోంది.

Vn Adhitya movie with K Raghavendra Rao
Author
Hyderabad, First Published Oct 6, 2021, 12:01 AM IST

దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా కొత్త అధ్యాయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాఘవేంద్రరావు నటుడిగా బిజీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో సినిమా మొదలైంది. ఈ చిత్రానికి తణికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ళ భరణి  దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో మరో చిత్రానికి రంగం సిద్దం అవుతోంది.

వివరాల్లోకి వెళితే... మానవ సంభందాలు, ఎమోషన్స్ కు కమర్షియక్ టచ్ ఇవ్వడంలో భరణిగారిది అందెవేసిన చేయి. రచయితగా ఆయన ఎన్నో సినిమాల్లో ఇలాంటి పాత్రలు రాసారు. నటుడుగా చేసారు.  అందుకే ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు రాఘవేంద్రరావు. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ఇందులో రాఘవేంద్రరావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన  భార్యగా స్టార్ నటి రమ్యకృష్ణ నటించనున్నారు. అలాగే శ్రియ, సమంతలు అతిథి పాత్రల్లో నటిస్తారనే టాక్ కూడ ఉంది. అలాగే రాఘవేంద్రరావు కుమార్తెగా స్టార్ నటిని తీసుకోనున్నారట.

ఇదిలా ఉండగా.. తాజాగా రాఘవేంద్రరావు మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తెలుగులో ఎన్నో హిట్టు సినిమాలు తీసిన వి.ఎన్.ఆదిత్య ఆ తరువాత ‘బాస్’, ‘ఆట’, ‘రాజ్’ తర్వాత జోరు తగ్గించారు. ఇప్పుడు దర్శకుడిగా మళ్లీ బిజీ అవుతున్నారు. ఆ క్రమంలోనే రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో సినిమా కథ రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అరవై ఏళ్ల వ్యక్తి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని టాక్. తనికెళ్ల భరణి సినిమా పూర్తయ్యాకే ఆదిత్యతో సినిమా మొదలవుతుందని అంటున్నారు.. 

తణికెళ్ల భరణి మాట్లాడుతూ... ‘మిథునం’ బాలుగారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. దీనికి కూడా మహర్షి కారణం. ఒకరోజు నాదగ్గరికి ఒక కథ తీసుకొచ్చాడు. ఇది రాఘవేంద్రరావుగారికి చెబుదామనుకుంటున్నాను అన్నాడు. ‘ఆయన సినీ ముని..’ నోట మాటే మాట్లాడరు.. ఆయన నటించడమంటే అసలే ఒప్పుకోరు అన్నాను. మా వాడు వెళ్లాడు.. ఆయన అసలే వినలేదు. వచ్చాక నాకు కథ చెప్పాడు. కథ చాలా బాగుంది. కొత్త కథ. నేను రాఘవేందర్రావుగారికి ఫోన్‌ చేశాను. ‘‘గురువుగారు.. మీరు ఈ సినిమా చేయకండి. కానీ.. ఇలాంటి పాత్ర మీరే చేయాలి’’ అన్నాను. ‘‘అవునా.. సరే రమ్మను కథ వింటా’’ అని అన్నారాయన. విన్న తర్వాత కథ ఆయనకు కూడా నచ్చింది. డైరెక్టర్‌ ఎవరూ అని అడిగారు. మహర్షి నా పేరు చెప్పాడట. కథ ఓకే అయింది. మీరే డైరెక్టర్‌ అని చెప్పాడు. నేను షాక్‌ అయ్యా. వంద సినిమాల కంటే ఎక్కువే డైరెక్ట్‌ చేసిన గొప్ప డైరెక్టర్‌కి నేను డైరెక్ట్‌ చేయడం నిజంగా ఆ పరమేశ్వరుడి కృప అనుకున్నాను.
 
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దాదాపు ఒకప్పటి అగ్రహీరోలందరితో కలిసి సినిమాలు తీసిన ఆయన ఈ మధ్యకాలంలో నటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ‘పెళ్లి సందD’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వశిష్ట అనే పాత్రతో ఆయన ప్రేక్షకులను అలరించబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios