వీజే సన్నీ `సౌండ్ పార్టీ’ మూవీ రిలీజ్ డేట్.. ఈనెలలోనే విడుదల.. ఎప్పుడంటే?
బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరో గా వస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. ఎట్టకేళలకు ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అప్డేట్ అందించారు. ఇదే నెలలో సినిమా విడుదల కానుందని ప్రకటించారు.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో వీజే సన్నీ (VJ Sunny) హీరోగా అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సన్నీ ‘అన్ స్టాపబుల్’ తో అలరించారు. ప్రస్తుతం ‘సౌండ్ పార్టీ‘ (Sound Party) అనే కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పటి నుంచో సినిమాను ప్రమోట్ చేస్తున్న టీమ్ తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈనెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై టాలీవుడ్ లో గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి మాట్లాడుతూ...`` ఇప్పటికే విడుదలైన మా `సౌండ్ పార్టీ` చిత్రం టీజర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ కు మా చిత్రం ద్వారా ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు. సమర్పకుడు జయ శంకర్ మాట్లాడుతూ...``పాటలు, టీజర్ సినిమాను ఇప్పటికే పబ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్తయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోందన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...``నిర్మాతలు ఇచ్చిన ఫ్రీడంతో సమర్పకులు జయ శంకర్ సపోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. ఇటీవల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. మా చిత్రానికి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఒక మంచి సినిమా చేయగలిగా. ఇప్పటికే టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందన్నారు.
మూవీలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ అందించారు.