ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రణ్ వీర్ సింగ్ కు మద్దతు పెరుగుతోంది. ఈ విషయంలో రణ్ వీర్ ను వ్యతిరేకిస్తున్న వారికి.. లేడీస్ చేస్తున్న ఎక్స్ పోజింగ్ విషయంలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  

బాలీవుడ్ రచ్చ రచ్చ జరుగుతుంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నగ్నఫొటోషూట్ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ చేసిన ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత అయితే నిరసనలు వస్తున్నాయో అంతే సపోర్ట్ కూడా వస్తుంది రణ్ వీర్ కు తాజాగా రణ్ వీర్ సింగ్ సపోర్ట్ చేసేవారి లిస్ట్ లోకి ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా వచ్చి చేశారు. 

దేశ వ్యాప్తంగా కొంత మంది రణ్ వీర్ సింగ్ కు వ్యాతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీశాడంటూ నటుడిపై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైంది. ఈ విమర్శలు, ఎఫ్ఐఆర్‌పై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందించాడు. రణ్‌వీర్‌కు అండగా మాంట్లాడారు. ఇదో స్టుపిడ్ ఎఫ్ఐఆర్ అని కొట్టిపడేశాడు. ఎలాంటి కారణం లేకుండానే నమోదైన కేసుగా వివేక్ దీనిని అభివర్ణించాడు. 

రణ్ వీర్ చేసిన పనికి మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. అదే విషయాన్నిపోలీస్ ఎఫ్ఐఆర్‌లో కూడా పేర్కొన్నారని, మరి మహిళల నగ్న చిత్రాల వల్ల పురుషుల మనోభావాలు దెబ్బతినవా? అని ప్రశ్నించాడు. వారు ఎక్స్ పోజింగ్ లు చేస్తున్నప్పుడు ఈ వాదనలు రావడంలేదేంటి అని ఘాటుగా స్పందించారు. ఇదో మూర్ఖపు వాదన అని వివేక్ తేల్చి చెప్పాడు. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉందని, మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని తాను చెబుతానని అగ్నిహోత్రి అన్నారు. 

ఈ విషయంలో వివేక్ మాత్రమే కాదు చాలా మంది రణ్ వీర్ సింగ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. విష్ణువిశాల్ లాంటి కొంత మంది హీరోలు రణ్ వీర్ సింగ్ కు సపోర్ట్ చేయడమే కాదు.. ఆయన్ను ఫాలో అవుతూ.. ఫోటో షూట్స్ కూడా చేశారు. ఇక ఇలాంటి విషయాలలో అందరూ రామ్ గోపాల్ వర్మ స్పందన గురించి ఎదురు చూస్తుంటారు. ఇక ఆయన కూడా అందరూ అనుకున్నట్టు గానే రణ్ వీర్ కు సపోర్ట్ చేశాడు. తన మార్క్ స్టైల్లో స్పందిచారు. లింగ సమానత్వం చూపించడానికే రణ్ వీర్ ఇలా చేసి ఉంటాడన్నారు ఆర్జీవి. అందులో తప్పేముంది అంటూ స్పందించారు. 

వర్మ మాత్రమే కాదు బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా కొంత మంది స్టార్స్ రణ్ వీర్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఆడవారు చేయగాలేనిది మగవారు చేస్తే ఏం తప్పు వచ్చింది.. వారికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని అంటున్నారు. మరి ఆడవారి విషయంలో మగవారు గట్టిగా స్పందిస్తే.. ఒప్పుకోరు కదా అంటున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో.