'ప్రేమకథా చిత్రమ్' మూవీలో తన నటనతో నందిత రాజ్ అందరిని ఆకర్షించింది. ఆ చిత్రంతో నందితకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేమ కథాచిత్రమ్ తర్వాత నందితకు మరో మంచి చిత్రం పడలేదు. ప్రస్తుతం నందిత నటిస్తున్న చిత్రం విశ్వామిత్ర. ఆసక్తిక్రమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది. తాజాగా విశ్వామిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించారు. మధ్య తరగతి యువతిగా ఈ చిత్రంలో నందిత నటిస్తోంది. ఓ వ్యక్తివలన ఆమె జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ వ్యక్తి ఎవరు.. నందితకు ఎదురైన కష్టం ఏంటి అనేదే ఈ చిత్రంలో సస్పెన్స్. గీతాంజలి, త్రిపుర చిత్రాలని తెరకెక్కించిన రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. రాజ్ కిరణ్, మాధవి అద్దంకి, ఎస్ రజనీకాంత్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సెన్సార్ సభ్యులు విశ్వామిత్ర చిత్రానికి 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. సెన్సార్ సభ్యుల నుంచి విశ్వామిత్ర చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. వారి స్పందన చూశాక విశ్వామిత్ర చిత్రం కోసం తాము ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మరచిపోగలిగామని తెలిపారు. విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానా, సత్యం రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.