Asianet News TeluguAsianet News Telugu

అమ్మోరు పూనేసిందిరా.. ఇక ఈ రాత్రికి శివాలెత్తిపోద్ది..విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ ఇదిగో

యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. చివరగా విశ్వక్ సేన్ గామి అనే చిత్రంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Vishwak Sen Gangs of Godavari Teaser out now dtr
Author
First Published Apr 27, 2024, 6:05 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. చివరగా విశ్వక్ సేన్ గామి అనే చిత్రంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. సినిమా సినిమాకి విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్ లో కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తోంది. 

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్ర టీజర్ విడుదలయింది. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేశారు. మే 17 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే టీజర్ మాత్రం అదిరిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్న అమ్మవారి నేపథ్యంలో టీజర్ కట్ చేసారు. 

విశ్వక్ సేన్ మాస్ అవతారం టీజర్ లో సర్ప్రైజింగ్ అనిపించేలా ఉంది. యాక్షన్ ఎపిసోడ్ లో విశ్వక్ సేన్ ' అమ్మోరు పూనేసిందిరా.. ఇక ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్ది అంటూ అదిరిపోయే డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. 

 

నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు అంటూ తన క్యారెక్టర్ ని విశ్వక్ సేన్ చెప్పకనే చెబుతున్నాడు. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి విశ్వక్ సేన్ కి జోడిగా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios