Asianet News TeluguAsianet News Telugu

#Vishwaksen:తగ్గేకొద్దీ మింగుతారన్నా పట్టించుకోలేదు, వార్నింగ్ కు విలువ లేదే

 తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది.. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.. గంగమ్మ తల్లి కి నా ఒట్టు.. మహా కాళి మాతో ఉంది.. డిసెంబర్‌లో సినిమా రాకపోతే.. 

Vishwak Sen Gangs of Godavari gets postponed to March 2024 jsp
Author
First Published Nov 28, 2023, 6:12 AM IST


నెల క్రితం విశ్వక్ సేన్ ఆవేశంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తగ్గేకొద్దీ మింగుతారు అంటూ కొంచెం ఎక్కువ అనిపించేలా మాట్లాడారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ మారిస్తే కుదరదు అన్నట్లు తేల్చి చెప్పేసారు.  అప్పటికే ఈ రిలీజ్ డేట్ మారేలా ఉండటంతో  సోషల్ మీడియాలో   విశ్వక్ సేన్  ఆగ్రహం వ్యక్తం చేశాడు.బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం.. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం.. అది మీ నిర్ణయం.. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు.. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది.. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.. గంగమ్మ తల్లి కి నా ఒట్టు.. మహా కాళి మాతో ఉంది.. డిసెంబర్‌లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్‌లో కనిపించను.. రాను.. అని విశ్వక్ సేను ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అయితే  తన సినిమా విడుదల తేదీని మార్చేస్తే ఆ సినిమాని ప్రమోట్ చెయ్యను అని నిర్మాతలకు అల్టిమేటం ఇచ్చినా పని అవ్వలేదు. విడుదల తేదీ ని మార్చారు నిర్మాతలు. విశ్వక్ సేన్  నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాని డిసెంబర్ 8న విడుదల చేస్తామని అప్పుడు ప్రకటించారు నిర్మాతలు. కానీ, నాని నటించిన “హాయ్ నాన్న”, నితిన్ నటించిన “ఎక్స్ట్రా” సినిమాలు డిసెంబర్ 7, 8 డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో తమ సినిమా డేట్ ని మార్చేద్దామని నిర్మాత నాగవంశీ అనుకున్నారు.

నిర్మాత ఇలా డిస్కషన్స్ లో  ఉండగానే, హడావిడిగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిర్మాత ఒకవేళ డేట్ మార్చితే నేను “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటాను అని ప్రకటించాడు. అయితే ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమాని ఏకంగా మార్చి 8, 2024కి మార్చేశారు. డిసెంబర్ 8న విడుదల కావాల్సిన సినిమా మూడు నెలల తర్వాత విడుదల కానుంది.  దాంతో నిర్మాతలు తమ వీలుని బట్టి చేస్తారు కానీ హీరోగారు ఏదో చెప్పారని ఎందుకు మారుస్తారు..బాబుకి కాస్త ఆవేశం ఎక్కువ లే అని సోషల్ మీడియా జనం కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్‌ సింగిల్‌ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మీద మంచి అంచనాలున్నాయి. టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఇక నేహా శెట్టి అందాలు, విశ్వక్ సేన్ నేహా శెట్టి కెమిస్ట్రీ కూడా  సూపర్బ్ గా ఉంది.ఈ మూవీని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. అంజలి మరో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. విశ్వక్‌సేన్‌ మరోవైపు VS10లో కూడా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. విశ్వక్‌సేన్‌ మరోవైపు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గామి (Gaami) కూడా పూర్తి చేశాడు‌.గామి రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios