DasKaDhamki Review: విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' ప్రీమియర్ టాక్.. పర్ఫెక్ట్ గా ఉందా.. తేడా కొట్టిందా ?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమ్కీ'. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ విశ్వక్ సేన్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం.

Vishwak Sen Das Ka Dhamki movie premier show review

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధమ్కీ'. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్ సేన్ ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ విశ్వక్ సేన్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. నేడు ఉగాది కానుకగా మాస్ కా దాస్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో యుఎస్ నుంచి ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం. 

విశ్వక్ సేన్ తన బోల్డ్ యాటిట్యూడ్, మ్యానరిజమ్స్ తో యువతలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రాల్లో తన పంథా మార్చుకుని వైవిధ్యం ప్రదర్శించాడు. నేడు రిలీజ్ అవుతున్న దాస్ కా ధమ్కీ చిత్రంతో విశ్వక్ సేన్ తిరిగి తన స్ట్రాంగ్ జోన్ లోకి వచ్చాడు. మాస్ కా దాస్ చిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి ఫాన్స్ కి ఉగాది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా విశ్వక్ సేన్ మార్క్ లోనే సాగుతుంది. 

Vishwak Sen Das Ka Dhamki movie premier show review

విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. కథ స్లోగా మొదలై ఇంటర్వెల్ చేరుకునే కొద్దీ ఆసక్తిగా ఉంటుంది. ఎక్కువ భాగం కథ చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు. కామెడీ టైమింగ్ తో, మాస్ అంశాలతో నడిపించారు. ఇక లవ్ ట్రాక్ చాలా చింతల్లో చూసినదే అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. 

విశ్వక్ సేన్ కృష్ణదాస్ పాత్రలో కనిపిస్తాడు. తన స్నేహితులతో కలసి స్టార్ హోటల్ లో పనిచేస్తుంటాడు. కస్టమర్స్ నుంచి కృష్ణదాస్ కి తరచుగా అవమానాలు ఎదురవుతుంటాయి. ఇక కీర్తి (నివేత పేతురాజ్) తో పరిచయం తర్వాత కృష్ణదాస్ లైఫ్ లో ప్రేమ మొదలవుతుంది. రావు రమేష్ పాత్రతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఇవన్నీ రెగ్యులర్ గా అనిపించే సన్నివేశాలే. కానీ విశ్వక్ సేన్ మాస్ కి నచ్చే విధంగా టేకింగ్ లో వైవిధ్యం చూపించాడు. 

ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో గేర్ షిప్ట్ చేయాలనే ఆలోచన కావచ్చు . ట్విస్ట్ లు అవసరమైనదానికంటే ఎక్కువ పడ్డాయి. దీనికి తోడు కన్ఫ్యూషన్ డ్రామా కూడా ఎక్కువే. విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పే బోల్డ్ మాటలు యూత్ కి ఒకే కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది తప్పదు. 

Vishwak Sen Das Ka Dhamki movie premier show review

సెకండ్ హాఫ్ లో దాస్ సంజయ్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే డ్రామా కాస్త చిరాకు పుట్టిస్తుంది. కథని నడిపించడం కోసం పోరాట సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే విశ్వక్ సేన్ ఫైట్స్ తో అంత కిక్కు ఇవ్వలేదు. 

విశ్వక్ సేన్ కామెడీ, యాక్టింగ్ కి మంచి మార్కులే వేయాలి. సంగీతం పరంగా ఈ చిత్రం ఒకే అని చెప్పాలి. పాటలు స్క్రీన్ పై ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి. ఓవరాల్ గా దాస్ కా ధమ్కీ చిత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో, విశ్వక్ సేన్ స్టయిల్ లో తెరకెక్కించిన కమర్షియల్ మూవీ. అక్కడక్కడా కొన్ని మెరుపులు, ఫన్ మూమెంట్స్ తో ఈ చిత్రం యావరేజ్ గా ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios