మాస్ కా దాస్‍గా పాపులర్ అయిన విశ్వక్‍సేన్ అఘోరగా ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగిందో చూద్దాం.
కొత్త ఆలోచనలకు, కొత్త తరహా కథాంశాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూంటారు. అది గమనించే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఆ దిసగా ప్రయాణం పెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడూ మనం ఊహించని సినిమాలు వచ్చి విజయం సాధిస్తున్నారు. అలాంటి ఆశనే కలిగిస్తూ ...భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘గామి’ సినిమా రెడీ అవుతోంది. మరో రెండు రోజుల్లో మార్చి 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఎగ్జైట్ చేసింది. ఆసక్తిని ఆమాంతం పెంచేసింది. మాస్ కా దాస్‍గా పాపులర్ అయిన విశ్వక్‍సేన్ అఘోరగా ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగిందో చూద్దాం.
ట్రేడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ధీరజ్ మొగలినేని ఈ చిత్రం రైట్స్ ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 12 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని తెలుస్తో్ంది. ఇక ఓవర్ సీస్ బెల్ట్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని ZEE5 వారు లాక్ చేసారు.
గామి సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గామి సినిమా రన్ టైమ్ వివరాలు కూడా బయటికి వచ్చాయి. ఈ చిత్రం రన్‍టైమ్ 2 గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు) ఉండనుంది. క్రౌడ్ ఫండెడ్ అడ్వెంచర్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడట. అతను మానవ స్పర్శను అనుభవించలేడట. ఆ వ్యాధి నివారణ కోసం విశ్వక్ హరిద్వార్ నుంచి హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అతని శారీరక సమస్యకు నివారణ కోసం ఈ అన్వేషణ అంతర్గత ప్రయణానికి దారి తీస్తుందని తెలుస్తోంది.
కథ పరంగా గామి చాలా కొత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో ఐదేళ్ల కిందట మొదలైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉండబోతుందని విశ్వక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. గామి చిత్రానికి విద్యాధర్ కగిట దర్శకత్వం వహించారు. సుమారు ఆరేళ్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించగా.. చాందినీ చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొటోలీ, బొమ్మ శ్రీధర్ కీలకపాత్రల్లో నటించారు. మరి గామి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
