మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'ఓటర్' సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు జి.ఎస్.కార్తిక్ కి మంచు విష్ణుకి మధ్య క్రెడిట్స్ కి సంబంధించి వివాదం చేలరేగింది. ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగారు.

మీడియాని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇంకా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు సినిమా ఆర్ధిక ఇబ్బందులో ఉంది. సినిమా పూర్తయినా విడుదల చేయలేని పరిస్థితి. ఇప్పటికీ విడుదల చేయకపోతే వడ్డీలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ నెల 21న సినిమాను విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు.

ఈ మేరకకు అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని మంచు విష్ణు భావిస్తున్నాడు. వివాదం కొలిక్కి రాకుండా ఎలా రిలీజ్ చేస్తారని నిర్మాతలను ప్రశ్నిస్తున్నారట. విడుదల చేస్తే ఊరుకోనని హెచ్చరిస్తున్నాడట.

అంతేకాదు.. సినిమా ప్రమోషన్స్ కి రానని, సినిమా గురించి ఎక్కడా మాట్లాడానని తేల్చి చెప్పేస్తున్నాడని సమాచారం. మరోపక్క దర్శకుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు గురించి పట్టించుకోవడం లేదట. అటు హీరో, ఇటు దర్శకుడు వదిలేసిన ఈ సినిమాను నిర్మాతలే ఎలాగోలా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!