కేవలం అనుమానంతో ఒకడి జీవితాన్ని నాశనం చేస్తే ఎవడో ఒకడు తిరిగి దెబ్బకొడతాడనే భయం పుట్టాలి.. అంటూ ఎఫ్ ఐ ఆర్ ట్రైలర్ లో విష్ణు విశాల్ చెబుతున్న డైలాగ్ లు సినిమా థీమ్ ఎలా వుంటుందన్నది స్పష్టం చేస్తున్నాయి.


తమిళ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్‌ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోగా.. చిత్ర ట్రైలర్‌ని న్యాచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

YouTube video player

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘2 నిమిషాల 12 సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండటమే కాకుండా ఆలోచింపజేసేదిలా ఉంది. అబూ బక్కర్ అబ్దుల్లా అనే భ‌యంక‌ర‌మైన టెర్ర‌రిస్ట్ కార‌ణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌నేది చిత్ర క‌థ‌గా చూపించారు.

`టెర్రర్ పుట్టాలి.. టెర్రరిజమ్ పెరగాలి .. ఇందు కోసం నాకు ఓ ఆర్మీ కావాలి.. అంటూ ఓ వ్యక్తి చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఐఎస్ ఐ టెర్రిరిజమ్ నేపథ్యం లో ఈ సినిమా సాగనుంది. సాధారణ జీవితం గడుపుతున్న ఇర్ఫాన్ అహమ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐఎస్ ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పై జరిగిన పరిశోధన కారణంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?.. చివరికి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఇన్నోసెంట్ ఇర్ఫాన్ అహమ్మద్ దేశ ద్రోహిగా ఎందుకు చిత్రించబడ్డాడు? తనలా మరొకరు బలికాకూడదని తను ఎలాంటి పోరాటం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.

ఇర్ఫాన్ అహ్మద్ పాత్ర‌లో విష్ణు విశాల్ న‌టించాడు. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక తీవ్రవాదుల‌ని నిర్మూలించే ఆఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ న‌ట‌న ప్ర‌త్యేకంగా కనబడుతోంది. మంజిమా మోహన్ స్క్రీన్ ప్ర‌జెన్స్ ప్ల‌జంట్‌గా ఉంది. అరుల్ విన్సెంట్ కెమెరా ప‌నిత‌నం, అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్స్ కాబోతున్నాయనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచేదిగా ఉంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.