సౌత్ లో అన్ని భాషలకు తెలిసిన నటుల్లో విశాల్ ఒకడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈ కోలీవుడ్ హీరో త్వరలో అయోగ్య సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్. 

మొదట తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పిన విశాల్ ఇప్పుడు పెద్దగా చప్పుడు చేయడం లేదు. సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి విశాల్ సిద్దమయ్యాడు. అసలైతే ఇదే నెలలో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ సమ్మర్ మిడిల్ కు షిఫ్ట్ చేయడంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. విశాల్ సినిమాను మొదలెట్టకముందే కోలీవుడ్ జనాలు చాలా వరకు ఎన్టీఆర్ సినిమాను చూసేశారు. ఇక విశాల్ రీమేక్ చేస్తున్నాడు అని అఫీషియల్ ఎనౌన్స్ రాగానే సినిమాపై ఇంకా చాలా మంది ఓ లుక్కేశారు. ఆ తరువాత విశాల్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ రేంజ్ ని ధాటి ఉండకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు విశాల్ లో కొంత టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా శింబు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాను ఫాలో అయ్యి దారుణంగా దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పుడు విశాల్ అయోగ్య సినిమాకు హైప్ లేకపోవడంతో సినిమాను సమ్మర్ కి షిఫ్ట్ చేశాడట. ఆ లోపు ప్రమోషన్స్ తో సినిమా రేంజ్ ను పెంచుకోవాలని ఈ హీరో ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.