టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన టెంపర్ మూవీని తమిళ్ లో విశాల్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విశాల్ తెగ కష్టపడుతున్నాడట. ఎన్టీఆర్ లో కొత్త షెడ్ ని చూపించిన ఆ కథలో మరొక హీరోని ఊహించుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు విశాల్ సరికొత్తగా చేస్తానని చెబుతున్నాడు. 

అయోగ్య అనే ఈ టెంపర్ రీమేక్ ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు విశాల్. ఇక షూటింగ్ ను ఏ మాత్రం గ్యాప్ లేకుండా స్పీడ్ చేస్తోంది చిత్ర యూనిట్. రీసెంట్ గా వైజాగ్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు నేటివిటీకి తగ్గటుగా ఉండాలని ఆ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి టెంపర్ ను ఎన్టీఆర్ తో ఊహించేసుకున్న తెలుగు ఆడియెన్స్ విశాల్ ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.   

మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా లైట్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఠాగూర్ మధు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రాశి ఖన్నా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక బాలీవుడ్ టెంపర్ రీమేక్ లో లో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.