దక్షిణాదిలో జంతువులను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు తీయడం ఒకప్పుడు జరిగేది. కానీ కమర్షియల్ ఫార్ములా వచ్చిన తరువాత జంతువులతో సినిమాలు తీయడం తగ్గించేశారు. రీసెంట్ గా రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమా తీశాడు. 

కానీ ఆ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు హీరో విశాల్ కుక్కని హీరోగా పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట. హీరో  కాకముందు విశాల్ దర్శకత్వశాఖలో పని చేసిన సంగతి తెలిసిందే.

అప్పటినుండే తనకి దర్శకుడిగా సినిమా చేయాలని కోరిక. ఇటీవల ఆ విషయాన్ని కూడా వెల్లడించాడు. వచ్చే ఏడాదిలో విశాల్ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఫక్తు కమర్షియల్ సినిమా కాకుండా తన సినిమాపై క్యూరియాసిటీ పెరిగే విధంగా కుక్కని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకుంటున్నాడట ఈ హీరో.

ఇందులో హీరోయిన్ త్రిష కీలకపాత్రలో కనిపిస్తుందని సమాచారం. విశాల్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమాతో దర్శకుడిగా ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి!

డైరెక్షన్ కి సిద్దమైన విశాల్.. హాలీవుడ్ తరహాలో ఉంటుందట!