విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. విశాల్ నటించిన చివరి చిత్రాలు ఎనిమి, చక్ర, అభిమన్యుడు ఇలా అన్ని చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రాలని విశాల్ నెక్స్ట్ లెవెల్ సూపర్ హిట్స్ గా మలచలేకపోతున్నాడు.

విశాల్ వరుసగా థ్రిల్లర్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటున్నాడు. విశాల్ నటించిన చివరి చిత్రాలు ఎనిమి, చక్ర, అభిమన్యుడు ఇలా అన్ని చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రాలని విశాల్ నెక్స్ట్ లెవెల్ సూపర్ హిట్స్ గా మలచలేకపోతున్నాడు. ప్రస్తుతం విశాల్ 'లాఠీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. 

షూటింగ్ లో పలుమార్లు గాయాల పాలైనా విశాల్ తగ్గడం లేదు. లాఠీ చిత్రం వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలయింది. టీజర్ లో విశాల్ లుక్ డిఫెరెంట్ గా ఉంది. యూనిఫామ్ లో నార్మల్ డ్రెస్ లో రెండు విభిన్న లుక్స్ లో విశాల్ కనిపిస్తున్నాడు. 

విశాల్ ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండడం విశేషం. ఒక సాధారణ కానిస్టేబుల్ మాఫియా గ్యాంగ్ మొత్తాన్ని ముప్పు తిప్పలు పెడుతూ రచ్చ చేస్తున్నాడు. సాధారణ కానిస్టేబుల్ కి ఇదంతా ఎలా సాధ్యం అయింది.. అసలు కథ ఏంటి అనే ఉత్కంఠ టీజర్ చూస్తుంటే కలుగుతోంది. 

టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ లో విశాల్ ఎక్కువగా గాయాలతో కనిపిస్తున్నాడు. 'తప్పు చేసి తలదాచుకునే పోకిరివి నీకే అంత పొగరు ఉంటే ఆ తప్పు చేసిన వాడిని నిలదీసే పోలీసుని నాకు ఎంత పొగరుంటుంది' అంటూ విలన్ కి వార్నింగ్ ఇస్తూ విశాల్ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. నటి సునైనా ఈ చిత్రంలో విశాల్ కి జోడిగా నటిస్తోంది. త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. 

YouTube video player