సోషల్ మీడియాలో హీరోల మధ్య యుద్దాలు కామనే కానీ..మరీ విశాల్ ఫ్యాన్స్ కు, మహేష్ ఫ్యాన్స్ కు మధ్య అంటే సంభందం లేనట్లుగా అనిపిస్తోంది కదూ. అయితే ఇద్దరికి ఓ లింక్ ఉంది. అదేమిటంటే..రైతులు. రైతు సమస్యల మీద మహేష్ బాబు రీసెంట్ గా మహర్షి సినిమా తీసి హిట్ కొట్టారు. అందులో రైతుల కోసం తన ఆస్తిలో చాలా భాగం మహేష్ రాసేసినట్లు చూపెట్టారు. సినిమాల్లో అలాంటివి సర్వ సమాన్యం కాబట్టి థియోటర్ లో టప్పట్లు కొట్టి బయిటకు వచ్చేసారు. 

అయితే మహేష్ ఫ్యాన్స్ కొందరు ఆ విషయం హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. రైతులు కోసం మహేష్ చేసిన గొప్ప పని అని వారు రాసుకొచ్చారు. అయితే దాన్ని మిగతా హీరోల అభిమానులు ఖండించలేదు. కానీ విశాల్ అభిమానులు మాత్రం ఇప్పుడు మహేష్ కు కౌంటర్ ఇస్తున్నారు.  అందుకు కారణం మరోసారి రైతుల కోసం విశాల్ ఉదారత చూపటమే. 

జూ.ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా ని ‘అయోగ్యా’ పేరుతో హీరో విశాల్ తమిళ్‌లో రీమేక్ చేసాడు. అయితే గతంలో చేసినట్లుగానే ఈ సినిమా కోసం విశాల్ రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాకు కొనుగోలు చేసిన టికెట్‌ ధర నుంచి ఒక రూపాయిని రైతులకు ఇస్తున్నట్లు విశాల్ ప్రకటించాడు.

ఇంతకు ముందు  పందెం కోడి, అభిమన్యుడు తదితర చిత్రాలకు కూడా విశాల్ ఇలాగే రైతులకు విరాళం ఇచ్చాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. శామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిది.

ఇప్పుడు విశాల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూపెట్టి..రైతులు సమస్యలు చూపెట్టి హిట్ కొట్టిన మహేష్ ..ఎంత మేరకు రైతులు కోసం ఖర్చు పెడుతున్నారు , ఆ విధంగా రైతులు కోసం నిజంగా సాయిం చేస్తున్న హీరో విశాల్ అంటున్నారు. అంతుకే విశాల్ నిజ జీవిత మహర్షి అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు. ఆ హీరోలకు కూడా తెలియకపోవచ్చు.