హీరో విశాల్‌ తనకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్‌ని, ప్యాషన్‌ని చాటుకున్నారు. తలకి బలంగా సీసా పగిలిపోయినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. 

హీరో విశాల్‌ తనకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్‌ని, ప్యాషన్‌ని చాటుకున్నారు. తలకి బలంగా సీసా పగిలిపోయినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన `నాట్‌ ఏ కామన్‌ మేన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. తు పా శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రషూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. 

ఇందులో భాగంగా ఫైట్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విలన్‌ పాత్రధారులు విశాల్‌ని ఖాళీ సీసాలతో కొడుతుంటారు. అందులో భాగంగా విశాల్‌ తలకి వెనక భాగంలో బలంగా సీసా తగులుతుంది. సీసా పగిలి గాయమైనా లెక్క చేయకుండా ఆ ఫైట్‌ సీక్వెన్స్ ని పూర్తి చేశాడు విశాల్‌. అయితే ఇలాంటి సాహసోపేతమైన ఫైట్‌ సీన్స్ ని డూప్‌తో చేయిస్తుంటారు. కానీ డూప్‌ లేకుండా స్వతహాగా విశాల్‌ ఈ ఫైట్‌ చేయడం విశేషం. పైగా తలకు గాయమైనా పట్టించుకోకుండా ఫైట్‌ సీక్వెన్స్ ని పూర్తి చేశారు. 

అయితే విశాల్‌ తలకి సీసా తగిలి పగిలిపోయినా పెద్దగా గాయాలు కాకపోవడంతో యూనిట్‌ అంతా ఊపిరి పీల్చుకుంది. ఇంత జరిగినా విశాల్‌ ఎలాంటి బ్రేక్‌ లేకుండా షూటింగ్‌లో పాల్గొనడం అందరిని ఆకట్టుకుంటుంది. దీనిపై విశాల్‌ స్పందించారు. `ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నా. ఆ ఫైటర్‌ తప్పేమీ లేదు. టైమింగ్‌ మిస్‌ అయ్యింది. అయినా యాక్షన్‌ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌ కంటిన్యూ చేశాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ ని అద్భుతంగా తెరకెక్కించిన ఫైట్‌ మాస్టర్‌ రవివర్మకి ధన్యవాదాలు` అని ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. విశాల్‌31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

Scroll to load tweet…