Asianet News TeluguAsianet News Telugu

ముందు నేనే ప్రపోజ్ చేశా: విశాల్!

నటుడు విశాల్.. అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనీషా కూడా ఒక నటి కావడం, 'అర్జున్ రెడ్డి' వంటి చిత్రాల్లో నటించడంతో అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు.

vishal about his love story
Author
Hyderabad, First Published Jan 18, 2019, 12:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నటుడు విశాల్.. అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనీషా కూడా ఒక నటి కావడం, 'అర్జున్ రెడ్డి' వంటి చిత్రాల్లో నటించడంతో అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు. తన ప్రేమ కథను విశాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అనీషా నటి మాత్రమే కాదూ.. జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ప్లేయర్. సామాజిక సేవల్లోతనవంతు కృషి చేస్తుంటుంది. గత ఏడాది అక్టోబర్ లో విశాల్ 'అయోగ్య' షూటింగ్ కోసం విశాఖపట్టణం వెళ్లారట. అప్పుడు ఆ ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండడం చూశారట. మహిళలు మాత్రమే నటిస్తున్న 'ఆల్ అబౌట్ మిచ్చలో' అనే ఆంగ్ల చిత్ర యూనిట్ ని కలిసే అవకాశం అతడికి లభించింది.

ఆ సినిమాలో అనీషా కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమా కాన్సెప్ట్, ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలను చెందిన వారు నటించడం చూసి ఎట్రాక్ట్ అయిన విశాల్ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుండి ఆ సినిమా సంబంధించిన విషయాల గురించి అనీషాతో మాట్లాడుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. అది కాస్త ఇప్పుడు పెళ్లికి దారి తీసిందని విశాల్ చెప్పుకొచ్చారు.

ముందుగా తానే అనీషాకి ప్రపోజ్ చేసినట్లు స్పష్టం చేశారు. వివాహం తరువాత అనీషా నటించడం, నటించకపోవడంఅనేది ఆమె ఇష్టమని, ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ మధ్యకాలంలో అనీషా పులికి శిక్షణ ఇచ్చి నిద్రబుచ్చిన  వీడియో చూశారట విశాల్. తాను ఎప్పటినుండో మృగాలతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఇప్పుడు అనీషా సహకారంగా సినిమా చేస్తానని అన్నారు. వీరి పెళ్లి కొత్తగా నిర్మిస్తోన్న నడిగర్ సంఘం భవనంలోనే జరగనున్నట్లు విశాల్ చెప్పారు. దానికి అనీషా కూడా అంగీకరించిందని వెల్లడించారు.  

విశాల్ కూడా చెప్పేశాడు..!

షాకింగ్: 'అర్జున్ రెడ్డి' నటితో విశాల్ పెళ్లి!

 

Follow Us:
Download App:
  • android
  • ios