టాలీవుడ్ హీరోల్లో బిజినెస్ పరంగా మహేష్ ఇప్పుడు అగ్రగామిగా అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల మొదలైన AMB సినిమాస్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టిప్లెక్స్ లుక్స్ అదిరిపోయాయని ఒక బ్రాండ్ ఇమేజ్ రావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా బిజినెస్ మొదలెట్టాలని చర్చలు జరుపుతున్నారు. 

మహేష్ కు బిజినెస్ పాట్నర్ గా ఉన్న ఏషియన్ సునీల్ నారంగ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో AMB మల్టిప్లెక్స్ లను మరింతగా విస్తరింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. చెన్నై - బెంగుళూర్ అలాగే కొచ్చి వంటి నగరాల్లో అందుకు అనువైన ప్లేస్ లను వెతికే పనిలో ఉన్నారట. అయితే దూరాన ఉన్న రాష్ట్రాలపై కన్నేసిన AMB టీమ్ కు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కనిపించలేదా అని విమర్శలు మొదలవుతున్నాయి. 

మరో టాలీవుడ్ ఇండస్ట్రీ కోసం కష్టపడాలని ఇప్పటికే సినీ పెద్దలతో ఏపి ప్రభుత్వం చర్చలు జరిపింది. షూటింగ్ లు అలాగే సినిమా ఇండుస్త్రీలు వస్తే రాజధానికి వాల్యూ పెరుగుతుందని కూడా అన్నారు. కానీ సినీ ప్రముఖులు ఇతర నగరాల గురించి తప్ప ఏపి గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మహేష్ మల్టిప్లెక్స్ కూడా పక్కా రాష్ట్రాలకు తరలిపోవడంతో విషయం వైరల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ ఎదురయ్యే విమర్శలకు AMB టీమ్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.