అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి మరో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కథ ఎలా ఉన్నా డైరెక్టర్ విజన్ - హీరో యాక్టింగ్ సినిమాపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తెలుగులో హిందీలో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది. 

బాలీవుడ్ 100కోట్ల క్లబ్ లో చేరుతున్న ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కోలీవుడ్ లో ఆదిత్య వర్మపై అంచనాలను రేపింది. తమిళ్ రీమేక్ లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలా మొదట దర్శకత్వం వహించిన పార్ట్ ని మొత్తం క్యాన్సిల్ చేసిన విక్రమ్ డైరెక్టర్ ని కూడా మార్చేసిన విషయం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

సందీప్ వంగా సలహా మేరకు అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరిశయకు విక్రమ్ ఆదిత్య వర్మ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సందీప్ వంగ డైరక్ట్ చేసిన కబీర్ సింగ్ సాలిడ్ హిట్టవ్వడంతో విక్రమ్ అతన్ని పిలుస్తున్నట్లు సమాచారం. సినిమా మేకింగ్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.