విక్రమ్‌ హీరోగా రూపొందిన సినిమా 'మిస్టర్‌ కేకే'. అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం. తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా 'మిస్టర్‌ కేకే' పేరుతో విడుదల చేసారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా థ్రిల్‌ని అందించే విధంగా దర్శకుడు తెరకెక్కించాడని చెప్పబడుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని షోలు ఆల్రెడీ పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం  టాక్ ఏంటి, కథేంటో చూద్దాం. 

మలేషియాలో జరిగే ఈ కథలో విక్రమ్ ని కొందరు ఎటాక్ చేయటంతో దారుణంగా గాడపడతాడు. మరో ప్రక్క అక్షరహాసన్  తన భర్తతో కలిసి అక్కడే ఉంటుంది. ఆమె గర్బవతి. గాయపడ్డ విక్రమ్ ని ఆమె భర్త సేవ్ చేసి హాస్పటిల్ లో చేరుస్తాడు. అదే సమయంలో లీనా పోలీస్ అధికారిగా ఎంట్రీ. ఇంతలో ఊహించని విధంగా అక్షర హాసన్ కిడ్నాప్ కు గురి అవుతుంది. పోలీస్ లు విక్రమ్ ఇందుకు భాధ్యుడని గుర్తిస్తాడు. అతని గ్యాంగ్ వాళ్లు విక్రమ్ ని హాస్పటిల్ నుంచి సేవ్ చేయటానికి ఈ పని చేసారని నమ్ముతాడు. అక్షర భర్తనే ఈ కిడ్నాప్ కు వాడుకుంటారు.

అక్షర భర్త పోలీస్ లకు విక్రమ్ గురించి హింట్ ఇస్తాడు. ఈ లోగా మరో పోలీస్ అధికారి చేతిలో లీనా చనిపోవటం జరుగుతుంది. సెకండాఫ్ లో అసలు విషయం రివీల్ అవుతుంది. విక్రమ్ ని ఓ బిజినెస్ మ్యాన్ మర్డర్ కేసులో పోలీస్ ఇరికించటానికి ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసులు ఆ బిగ్ షాట్ ని చంపేసి ఉంటారు. ఆ క్రమంలో పోలీస్ ల నుంచి విక్రమ్ తప్పించుకుపోతాడు. ఛేజ్ . విక్రమ్ దగ్గర తను ఇన్నోసెంట్ ని అని ప్రూవ్ చేసుకునే సాక్ష్యం ఉంటుంది. దాన్ని నాశనం చేయాలని పోలీస్ ల తాపత్రయం. చివరకు అసలైన హంతుకులైన పోలీస్ లను పట్టుకోవటం సినిమా ముగుస్తుంది.  
 
కమల్ హాసన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అని తేలిపోయింది. అసలు కమల్, విక్రమ్ ఇలాంటి సినిమాని ఎలా ఓకే చేసారనేది మిస్టరీ గా చెప్తున్నారు. ఏదైమైనా విక్రమ్ కు మరోసారి భాక్సాఫీస్ దగ్గర పెద్ద దెబ్బే పడింది.