ఇష్క్‌, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్‌ కుమార్‌. ఆయన లాంగ్ గ్యాప్ తరువాత చేసిన గ్యాంగ్ లీడర్ పెద్దగా వర్కవుట్ కాలేదు.  దాంతో చాలా రోజులుగా విక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న టాక్ కు బ్రేక్ పడింది. ఈ నేపధ్యంలో  విక్రమ్‌...నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇది హారర్‌ థ్రిల్లర్‌  జానర్‌ లో ఉంటుందని వినపడింది. హారర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో చైతన్య ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. ఇదే అతని తొలి హారర్‌ సినిమా అవుతుందని అభిమానులు ఆనందపడ్డారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు సైతం ప్రక్కకు వెళ్లినట్లు సమాచారం.

దాంతో విక్రమ్ కుమార్ ఓటీటి వైపుకు ప్రయాణం పెట్టుుకన్నారు. ఓ వెబ్ సీరిస్ తో  రెడీ అవుతున్నాడు.చైతూతో అనుకన్న హారర్ స్క్రిప్టునే వెబ్ సీరిస్ కు మార్చి రాసినట్లు సమాచారం. తమిళ,తెలుగు భాషల్లో రెడీ అయ్యే ఈ సీరిస్ ..హారర్ థ్రిల్లర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.  ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంక ఈ వెబ్ సీరిస్ లో ఎవరు హీరోగా చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. బడ్జెట్ ని బట్టి తెలుగు,తమిళ భాషల్లో తెలుసున్న హీరోతో ముందుకు వెళ్తారంటున్నారు.

గతంలో విక్రమ్ కుమార్ ...13బి అంటూ మాధవన్ హీరోగా హారర్ ఫిల్మ్ చేసారు. ఆ సినిమా అప్పట్లో బాగా ఆడింది. అదే ప్రేరణతో ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్తున్నారు. ఈ వెబ్ సీరిస్ టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉంటుందని, సినిమా చూస్తున్న అనుభూతిని ఇవ్వాలని విక్రమ్ కుమార్ ఆలోచనగా చెప్తున్నారు. నెట్ ప్లిక్స్ లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.