నాగార్జున మొదట నుంచి ఓ విజన్ తో తన సినీ కెరీర్ ని మలుచుకుంటూ వస్తున్నారు. అందుకే ఆయన చేసినన్ని విభిన్న చిత్రాలు ఆయన జనరేషన్ హీరోలు చెయ్యలేకపోయారు. శివ,గీతాంజలి వంటి సినిమాలు ఆయన కెరీర్ లో అలా మెరిసాయి. ఇప్పుడు కూడా మరోసారి ఆయన తనదైన విజన్ తో తీసుకున్న నిర్ణయం ఆయన్ని మరో కెరీర్ ని మరో మెట్టు ఎక్కించబోతోందని తెలుస్తోంది. ఇంతకీ ఈ సారి ఆయన ఎంచుకున్న దర్శకుడు ఎవరు అంటారా..విక్రమ్ కుమార్.

సౌత్ ఇండియాలో టాలెంటెడ్ డైరక్టర్స్ ఒకరిగా లెక్కించబడుతున్న సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కుమార్. ఆయన సినిమాలు రెగ్యులర్ మసాలా సినిమాలకు విభిన్నంగా ఉంటాయి. అక్కినేని కుటుంబ కథా చిత్రం మనం తో ఆయన ఆ కుటుంబంలో ఒకరు అయ్యిపోయారు. ఆ సినిమా వారికి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఓ గిప్ట్ లా చేసి ఇచ్చారు.

ఆ తర్వాత అఖిల్ తో హలో అంటూ పలకరించారు కానీ అది బాంబ్ లా పేలిపోయింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకుని నానితో  ఓ క్రైమ్ థ్రిల్లర్ ని గ్యాంగ్ లీడర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మరో ప్రక్క నాగార్జున తన సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతున్నారు. తన కొడుకులకు సైతం పోటీ ఇస్తున్నారు. ఓ ప్రక్కన మన్మధుడు 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన రీసెంట్ గా విక్రమ్ కుమార్ చెప్పిన కథ విని ఓకే చేసారని సమాచారం.

త్వరలోనే పూర్తి డ్రాఫ్ట్ తో నేరేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మాణమయ్యే ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలవుతుంది. ఈ లోగా నాగార్జన బంగార్రాజు చిత్రం పూర్తి చేస్తారు.