‘తంగలాన్’అర్దం ఇదే, మళ్లీ ఈ సినిమాలో అలాంటి ప్రయోగమే
‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్.‘తంగలాన్’ అంటే అర్థం విడిగా లేదు అంటూ ఈ టైటిల్ వెనక ఉన్న విశేషాన్ని చెప్పారు విక్రమ్.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ రిలీజ్ కు రెడీ అవ్వుతోంది. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ తంగలాన్ అంటే అర్దం ఏమిటనేది తెలుగులో చాలా మందికి ఉండే సందేహాన్ని విక్రమ్ తీర్చేసారు.
విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్.‘తంగలాన్’ అంటే అర్థం విడిగా లేదు. అదొక తెగ పేరు. అలాగే రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్.. ఇలాంటి తరహా సినీ గ్లామర్ ‘తంగలాన్’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్ అంతగా ఉండవు. లైవ్ సౌండింగ్‌లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్. మేకప్‌కు మూడు గంటలు పట్టేది. మీనింగ్‌ఫుల్ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్‌గారు. ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్‌రెడ్డి, వినయ్‌లు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఈవెంట్‌కు వచ్చారు.లైఫ్ సర్కిల్‌లా అనిపిస్తోంది’’ అన్నారు.
‘‘విక్రమ్‌గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్ సూపర్. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్. ‘‘విక్రమ్ ట్రెమండస్ యాక్టర్. వరల్డ్ సినిమా లవర్స్‌కు ‘తంగలాన్’ ఓ గ్రేట్ ట్రీట్‌లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్ రాజా.