అఫీషియల్: విజయ్ 'ఖుషి' ఓటీటీ డేట్ ఫిక్స్
విజయ్ దేవర కొండ హీరోగా సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “ఖుషి”

ఈ మధ్య కాలంలో లవ్‌స్టోరీతో వచ్చి ఓ వర్గాన్ని ఆకట్టుకున్న చిత్రం 'ఖుషి'. విజయ్ దేవరకొండ, సమంత కలిసి అదిరిపోయే కెమిస్ట్రీ పండించిన ఈ చిత్రంకు రిలీజ్ కి ముందే మంచి హైప్ నెలకొంది. ఇక విడుదలయ్యాక ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా సినీ విమర్శకుల నుంచి సైతం పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో 'ఖుషి' ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ బయిటకు వచ్చింది. విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ తో ఓటీటీ డీల్ సెట్ చేసుకున్నారు నిర్మాతలు. అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి తేదీ ఫిక్సైంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించి పాండియా లెవెల్ లో తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. గీతా గోవిందం తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ ని రొమాంటిక్ రోల్ చూసేందుకు అభిమానులు సినిమాపై ఆసక్తి కనబరిచారు. అలాగే విజయ్, సమంతల జోడి వెండితెరపై ఫస్ట్ టైమ్ పూర్తిస్థాయిలో కనిపించనుండడంతో ఆడియన్స్ లోనూ మూవీపై క్యూరియాసిటీ నెలకొంది. అయితే అనుకున్న స్దాయిలో ఈ చిత్రం వర్కవుట్ కాలేదు.
దర్శకుడు శివ నిర్వాణ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే సినిమాకి ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు లాంగ్ రన్‌లో మాత్రం రూ.10 కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. యుఎస్ లో మల్టిఫ్లెక్స్ లలో సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
విప్లవ్(విజయ్ దేవరకొండ).. నాస్తికుల ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం రావడంతో అడిగి మరీ కశ‍్మీర్‌లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం (సమంత)ని లవ్‌లో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే తాను ముస్లిం కాదు హిందు అని, తన పేరు ఆరాధ్య అని ఫ్యామిలీ డీటైల్స్ చెబుతుంది. మరి చివరకు విప్లవ్-ఆరాధ్య ఒక్కటయ్యారా? అసలేం ఏం జరిగింది? అనేదే 'ఖుషి' స్టోరీ.