Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్‌ రామ్‌ సినిమాలో విజయశాంతి పాత్ర ఏంటో తెలుసా? మరోసారి లేడీ సూపర్‌ స్టార్‌ని చూడొచ్చేమో?

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఒకప్పుడు పవర్‌ఫుల్‌ రోల్స్ తో ఆకట్టుకున్నారు. కానీ మధ్యలో ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి ఆమె వింటేజ్‌ లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 
 

vijayashanti role in kalyan ram movie she come back with powerful role arj
Author
First Published Jun 23, 2024, 8:13 PM IST

టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న తొలి హీరోయిన్‌ విజయశాంతి. ఆమె సినిమాలు స్టార్‌ హీరోలకు దీటుగా ఆడాయి. వసూళ్లని రాబట్టాయి. ఇమేజ్‌ పరంగానూ మెగాస్టార్ వంటి వారికి ధీటుగా రాణించింది. హీరోయిన్‌గా, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పించింది. లేడీ సూపర్‌ స్టార్‌గా ఆమె పీక్‌ స్టేజ్‌ని చూసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యింది. పదిహేనేళ్లకుపైగానే ఆమె సినిమాలకు దూరంగా ఉంది. 

ఇటీవల ఆమె రీఎంట్రీ ఇచ్చారు. మహేష్‌ బాబు సినిమాలో `సరిలేరు నీకెవ్వరు` మూవీలో ఆమె కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక కమ్‌ బ్యాక్‌ మూవీ తర్వాత ఆమె సినిమాలు కంటిన్యూ చేస్తుందని భావించారు. కానీ తాను చేయనని, పూర్తిగా సినిమాలకే పరిమితం అని చెప్పింది. కానీ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తుంది. కళ్యాణ్‌ రామ్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. రేపు9(సోమవారం) ఈ సినిమాలోని విజయశాంతి పాత్రని పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించింది టీమ్‌. 

ఈ మేరకు ఓ ప్రీ రిలీజ్‌ని విడుదల చేశారు. ఇందులో పోలీస్‌ గెటప్‌లో ఓ లేడీ కనిపిస్తుంది. ఆమెనే విజయశాంతి అని చెప్పకనే చెప్పింది టీమ్‌. తనకు ఎంతో పేరు తెచ్చింది పోలీస్‌ రోల్‌. ఆమె ఇమేజ్‌ని మార్చేసింది కూడా పోలీస్‌ పాత్రలే. `కర్తవ్యం` నుంచి `శాంభవి ఐపీఎస్‌`, `శత్రువు`, `పోలీస్‌ లాకప్‌`, `స్టూవర్ట్ పురం పోలీస్‌ స్టేషన్‌` వంటి పలు చిత్రాల్లో ఆమె పోలీస్‌ పాత్రలు చేసి మెప్పించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో చాలా వరకు పోలీస్‌ రోల్సే కావడం విశేషం. అవే ఆమెకి లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తాను పవర్‌ఫుల్‌ రోల్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. చూడబోతుంటే వింటేజ్‌ విజయశాంతిని చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఆమెపాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుంది, ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ విజయశాంతిని పోలీస్‌ పాత్రలో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇక కళ్యాణ్‌ రామ్‌ సరసన సాయీ మంజ్రేకర హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోకా సినిమాస్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios