ఎనభైల్లో, తొంబైల్లో అప్పటి కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారిన అందం విజయశాంతి. ఫైర్ బ్రాండ్ గా వెలిగిన విజయశాంతి సినీ  ప్రపంచం నుంచి రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే రాజకీయాల్లో బిజిగా ఉంటూ ఇప్పటికీ వార్తలకెక్కుతోంది. అయితే అప్పటి నుంచీ ఆమె రీ ఎంట్రీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికీ ఆమె డేట్స్ ఇవ్వలేదు.

కానీ తాజాగా ఆమె మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్చపరిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటానికి ఆమె ను ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు చాలా ప్రయాసపడ్డారట. ఆ మధ్యన చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ అది గాసిప్పే అని తేలిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అనీల్ రావిపూడి ఆమె చుట్టూ తిరిగి, ఒకటికి నాలుగుసార్లు ఆమె పాత్ర నేరేషన్ ఇచ్చి ఓకే చేయించుకున్నట్లు సమాచారం.

సినిమాలో ఆమెదే కీ రోల్ కావటం , భారీ బడ్జెట్ చిత్రం కావటం, మహేష్ బాబు హీరో కావటం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆమె ఓకే చేసిందిట. విజయ శాంతి, మహేష్ ఇద్దరూ పోస్టర్స్ పై కనపడితే ఆ క్రేజ్ వేరుగా ఉంటుందని అంటున్నారు. హీరోయిన్ కు తల్లిగా ఆమె పాత్ర ఉంటుందని  ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అప్పట్లో వాణిశ్రీ చేసే పొగరుబోతు అత్త టైప్ పాత్ర అని మరికొందరు అంటున్నారు.

అయితే ఇంకా ఈ రోజుల్లో అత్తా-అల్లుళ్ల సవాల్ సినిమాలు నడుస్తాయా..ఎంత కామెడీ అయితే మాత్రం. ఆ మాత్రం మహేష్ కు తెలియదా అంటున్నారు. అయితే ఎఫ్ 2 లో పాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి పాయింటును, పెళ్లాం ఊరిళెతే పాయింటు ని కలిపి చెప్పి ఒప్పించలేదా..అలాగే మహేష్ తో కూడా చేస్తాడంటున్నారు. ఈ మ్యాటర్ లో ఎంత నిజముందో కానీ విజయ శాంతి మాత్రం సినిమాకు సైన్ చేయటం మాత్రం నిజం.