Asianet News TeluguAsianet News Telugu

పెద్దాయనకు కూడా ఇవ్వాల్సింది.. భారతరత్న అవార్డ్ పై విజయశాంతి కామెంట్స్ వైరల్..

రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మజీ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. ఆమె ఏమంటుందంటే..? 

Vijayashanthi Comments about Bharat Ratna award and Pv Narasimha Rao and Sr NTR JMS
Author
First Published Feb 10, 2024, 4:48 PM IST

తెలుగు రాష్ట్రాలకే వన్నెతెచ్చిన నేత, తెలుగుతేజం, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం  ‘భారతరత్న’ పురస్కారం  ప్రకటించిన వేళ.. అన్ని వార్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. లేట్ గా అయినా.. ఆయనకు సముచిత గౌరవం లభించిందంటూ..సినీ, రాజకీయ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్న వేళ..తాజాగా ఈ విషయంలో స్పందించారు  కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూనే..  ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేదని ఆమె అన్నారు. 

ఈమె పోస్ట్ లో ఈ విధంగా రాశారు.‘‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు. కానీ తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహారావుని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేది. ఇది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనిపిస్తోంది అన్నారు. 

 

అంతే కాదు... ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరుతుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తాయని కూడా నేనునమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’’ అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ విధంగా ఆమె ఎక్స్’ వేదికగాపోస్ట్ పెట్టారు. అంతే కాదు ఈ పోస్ట్ కు ఆమె ఓ ఫోటోను కూడా జత చేశారు. అందులో  ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విజయశాంతి నంది అవార్డు స్వీకరిస్తున్న పాత ఫొటోను పంచుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios