Asianet News TeluguAsianet News Telugu

‘రానా నాయుడు’పై మండి పడ్డ విజయశాంతి

“రానా నాయుడు” సినిమాపై విజయశాంతి సీరియస్ అయ్యారు. అయితే.. ఆ సినిమా పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు రాములమ్మ. ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై……

Vijaya shanthi fire on Rana Naidu Netflix India
Author
First Published Mar 18, 2023, 1:35 PM IST

రానా దగ్గుబాటి, సూపర్ స్టార్ విక్ట‌రీ వెంకటేష్ లతో కాంబినేషన్ లో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టు వచ్చిన విష‌యం తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ లు స్క్రీన్ షేర్ చేసుకున్న డ్రామా సిరీస్‌కు ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో తెరకెక్కించింది నెట్ ఫ్లిక్స్. అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా ఈ సిరీస్ రాబోతుంది. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిచింది.  ఈ వెబ్ సిరీస్ కి ఎంత మంచి టాక్ వస్తోందో.. అంతే నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. అశ్లీలత ఎక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో వచ్చే కామెంట్లపై రానా దగ్గుబాటి స్పందిస్తున్నారు. 

రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్‌ అంతా  చెప్తోంది. చూసేవాళ్లు చూస్తున్నారు. చూసి తిట్టేవాళ్లు తిడుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్న బూతు డైలాగ్స్, శృంగార కంటెంట్‌పై మాత్రం భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.. ఇన్ డైరెక్ట్‌గా ఈ వెబ్ సిరీస్‌పై పంచ్‌లు పేల్చింది. 
 
ముఖ్యంగా ఇటువంటి ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందు ముందు ప్రజా, మహిళా వ్యతిరేకత రాకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుదల చేసే కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి చేయాలని ఆమె సలహా ఇచ్చింది. అంతేకాకుండా.. తన సహనటులకు, నిర్మాతలకు కూడా ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది. ఇంతకీ విజయశాంతి ఏమని పోస్ట్ చేసిందంటే..

ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై......

‘It needs Censor for ott platform’...

అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.

ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను.

-విజయశాంతి
 
ఇక  డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్‌. వెంకటేశ్‌ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్‌ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్‌ ఆడియన్స్‌ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios