లేడీ సూప‌ర్‌స్టార్ విజయశాంతి… ఓ తరం కుర్రాళ్ల ఆరాధ్యదేవత. ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే… మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ మెప్పించి స్టార్ గా నిలబడిపోయింది. ఒక ద‌శ‌లో  స్టార్ హీరోల సినిమాల్లోనూ వారికి ధీటుగా ఉండే క్యారక్టర్స్ చేయటమే కాకుండా  అదే  స్థాయిలోనే రెమ్యునేషన్ ని కూడా అందుకున్న క్రెడిట్ విజ‌య‌శాంతిది. అయితే పాలిటిక్స్ లో  ప్రవేశించిన ఆమె క్రియాశీల‌క రాజ‌కీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరమయ్యారు రాములమ్మ.  

దాదాపు 13 ఏళ్ళ త‌రువాత‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తూండటంతో అంత గొప్ప పాత్ర ఆమె ఏమి చేయబోతోందనే చర్చ అంతటా మొదలైంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు అత్తగా విజయశాంతి నటించనున్నారని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. అయితే వాటిని విజ‌య‌శాంతి కొట్టిపారేసారు.ఈ చిత్రంలో మహేష్‌కు అత్తగా న‌టించ‌డం లేద‌నీ, అస‌లు త‌మ పాత్రల‌ మధ్య ఎటువంటి రిలేషన్ ఉండ‌దనీ, ఇద్దరి పాత్రలు స‌మాంత‌రంగా సాగే పాతల‌ని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమాలో తనది పూర్తిగా పాజిటివ్ రోల్‌ అని, నెగటివ్ క్యారెక్ట‌ర్స్‌కు తను దూరమని చెప్పారు లేడీ అమితాబ్‌. దాంతో ఆమె చేస్తున్న క్యారక్టర్ ఏమిటనే క్యూరియాసిటీ మరింతగా పెరిగిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ శాంతి ప్రొపెసర్ గా కనిపించనుంది.  

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ లా కాలేజీలో ఈ మేరకు సీన్స్ ఆమెపై షూట్ చేస్తున్నారు. గ్రే హెయిర్, కళ్లకు అద్దాలతో అచ్చమైన ప్రొఫెసర్ గా ఉన్నారు.   సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంటర్‌టైనర్‌… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.