టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత దర్శకురాలు, నిర్మాత, నటి విజయ నిర్మల సోదరుడు కన్నుమూశారు.
సంక్రాంతి పండగ వేళ టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. దివంగత దర్శకురాలు విజయ నిర్మల సోదరుడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. విజయ నిర్మల సోదరుడు ఎస్ రవికుమార్.. వయోభారంతో ఈ ఉదయం కన్నుమూశారు. విజయ నిర్మలకు ఆయన స్వయాన సోదరుడు కావడం విశేషం. ఇక సీనియర్ నటుడు నరేష్‌కి ఆయన మేన మామ అవుతాడు.
విజయ నిర్మల నటిగా, దర్శకురాలిగా బిజీగా ఉన్న సమయంలో ఆమెకి అండగా ఉన్నారు రవికుమార్. అన్ని విషయాల్లో ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. అంతేకాదు విజయకృష్ణ మూవీస్ ని ఆయనే నిర్వహించారు. ప్రొడక్షన్ పరంగా అన్నీ తానై వ్యవహరించారు. విజయ్ నిర్మల యాక్టివ్ ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కానీ ఆమె మరణంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. రవికుమార్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
విజయ నిర్మల 44 సినిమాలకు దర్శకత్వం వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. ఓ లేడీ దర్శకురాలు ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించడం ఇదే రికార్డు. అందుకే ఆమె అరుదైన ఘనతని సాధించింది. సూపర్ కృష్ణతోనే అత్యధిక మూవీస్ చేసింది. నటిగా, దర్శకురాలిగా ఆయనతోనే ఎక్కువ మూవీస్ చేసింది. ఇక అనారోగ్యం కారణంగా ఆమె 2019లో కన్నుమూశారు. 2022 నవంబర్‌లో కృష్ణ సైతం కన్నుమూసిన విషయం తెలిసిందే.
