విశాల్ డైరెక్షన్ లో విజయ్ సినిమా.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
కోలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వబోతోంది. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విశాల్ ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. హీరోగా నిర్మాతగా సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న విశాల్.. త్వరలో డైరెక్టర్ గా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఓ భారీ సినిమాను ఆయన డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం అది కూడా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతిని విశాల్ డైరెక్ట్ చేయబోతున్నాడట.
ప్రస్తుతం విశాలు మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ఒకటి రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే డిటెక్టీవ్ సినిమాను స్వయంగా విశాలే డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన విజయ్-లోకేష్ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలిపాడు.
విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమాలో విశాల్‌ను ఓ కీలకపాత్ర కోసం సంప్రదించగా, డేట్స్ సెట్ కాకపోవడంతో ఆ సినిమాలో చేయలేకపోయారు. కాని ఇప్పుడు నటించలేదు కాని.. త్వరలో విజయ్ తో సినిమా చేస్తాను అన్నాడు విశాల్. విజయ్‌తో తన డైరెక్షన్ లో సినిమా తీస్తానని వెల్లడించాడు. ఇప్పటికే విజయ్‌కు కథ చెప్పగా ఆయనదాదాపు ఒప్పుకున్నారని. త్వరలో ఈ విషయానికి సబంధించి అప్ డేట్ ఇస్తానన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ స్టార్ హీరో విశాల్‌కు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన సినిమాలు ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను సాధిస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అభిమన్యుడు తర్వాత ఇప్పటి వరకు ఈయనకు ఒక్క హిట్టు కూడా లేదు. ప్రస్తుతం విశాల్ నటించిన లాఠి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినమాలో ఎస్.జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు దళపతి విజయ్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వారసుడు సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా వారసుడు రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌తో తన 67వ సినిమా చేయనున్నాడు.