Asianet News TeluguAsianet News Telugu

లీక్ : బన్నీ సినిమాలో విజయ్ సేతుపతి క్యారక్టర్.. వింటే వణుకే!

ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. 

vijay setupathi role in allu arjun's next
Author
Hyderabad, First Published Mar 10, 2020, 9:23 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బన్నీ... క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్‌కు 20వ చిత్రం కావడంతో  చిత్ర యూనిట్‌ AA#20 వర్కింగ్‌ టైటిల్‌ను ఖరారు చేసి షూటింగ్ మొదలెడుతున్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ లోనే బన్ని రంగంలోకి దూకుతున్నాడు.  ఎర్ర చందనం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ...సాగే కథ కావడంతో, చిత్రాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో తెరకెక్కిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు బన్నీ ఈ చిత్రంలో గుబురు గెడ్డంతో కనిపించబోతున్నాడు. అలాగే ఆయన పాత్ర లారీ డ్రైవర్ అని తెలుస్తోంది. 

అలాగే ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర ...ఫారిస్ట్ రేంజిర్(ఫారిస్ట్ ఇన్సెపెక్టర్) అని తెలుస్తోంది. 

ఓ వైవిధ్యమైన మ్యానరిజంతో ఈ పాత్ర సాగుతుందిట. ఆ మ్యానరిజంతో ఓ విధమైన రగ్గడ్ లుక్ తో,తమిళ యాసతో సాగే ఆ పాత్ర చూస్తేనే వణుకు పుడుతుందని చెప్తున్నారు. సుకుమార్ ..ది బిస్ట్ అన్నట్లు చాలా దారుణంగా డిజైన్ చేసారుట. తమిళంలోనూ ఈ సినిమా ఆడాలంటే విజయ్ సేతుపతి పాత్ర బాగా ఎక్కాలని అలా చేసారని చెప్తున్నారు.  అలాగే రష్మిక మందన్న గిరిజన యువతిగా, అల్లు అర్జున్ కు భార్యగా నటిస్తోంది. శేషాచలం అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా  రా గా సాగే ఇంటెన్స్ డ్రామా అని చెప్తున్నారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో నటించిన అతిథి పాత్రతో విజయ్‌ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విజయ్‌కు తెలుగులో భారీగానే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి తెలుగులో ఇప్పటికే ‘ఉప్పెన’ అనే సినిమా చేసారు.  ఈ సినిమా తొలి షూటింగ్‌ నల్లమల అడవుల్లో జరగనుంది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో సాగే ఇసుక స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తు‍న్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios