Asianet News TeluguAsianet News Telugu

కథ నాకు తెలుసు.. రాంచరణ్ పాన్ ఇండియా సినిమాపై విజయ్ సేతుపతి జోస్యం..

బుచ్చిబాబు ఎంతో రీసెర్చ్ చేసి విజయనగరం, ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఒక కథ సిద్ధం చేశారు. అయితే స్టోరీ బ్యాక్ డ్రాప్ ఎవరికీ తెలియదు

Vijay Sethupathi interesting comments on Ram Charan and Buchibabu movie dtr
Author
First Published Jun 19, 2024, 6:01 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలిజ్ అవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. దీనితో చరణ్ అభిమానుల ఫోకస్ మొత్తం బుచ్చిబాబు దర్శకత్వంలో నటించే పాన్ ఇండియా చిత్రంపై పడింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ చిత్రంపై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. 

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా చాలా మంది బడా నటులు నటిస్తున్నారు. బుచ్చిబాబు ఎంతో రీసెర్చ్ చేసి విజయనగరం, ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఒక కథ సిద్ధం చేశారు. అయితే స్టోరీ బ్యాక్ డ్రాప్ ఎవరికీ తెలియదు.. కబడ్డీ అని, కుస్తీ అని ఇలా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ఆర్సీ 16 మూవీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు, విజయ్ సేతుపతి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

విజయ్ సేతుపతి రీసెంట్ గా నటించిన మహారాజ చిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీనితో బుచ్చిబాబు స్వయంగా విజయ్ సేతుపతిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చివర్లో విజయ్ సేతుపతి బుచ్చిబాబు తదుపరి చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ నాకు తెలుసు. బుచ్చి నాకు చెప్పాడు. కథ అద్భుతంగా ఉంటుంది. రాంచరణ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని విజయ్ సేతుపతి జోస్యం చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios