Asianet News TeluguAsianet News Telugu

‘మ‌హారాజ‌’ తెలుగులో ఎంతుకు కొన్నారు?..ఎంత లాభం రావచ్చు?

 విజయ్ సేతుపతి   50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు.  

Vijay Sethupathi 50th film Maharaja box office collections jsp
Author
First Published Jun 17, 2024, 11:15 AM IST


కొన్ని సార్లు డబ్బింగ్ సినిమాలు కూడా మ్యాజిక్ చేస్తాయి. కానీ గత కొంతకాలంగా తమిళ డబ్బింగ్ సినిమాలు మన దగ్గర ఆడటం లేదు. అయితే  ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 'మహారాజ' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఎక్కడ చూసినా ,విన్నా ఈ సినిమా గురించిన కబుర్లే. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించిన మాటలే.  విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి తన కెరీర్‌లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్‌దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది.మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్  తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంతకు తెలుగు డబ్బింగ్ రైట్స్ కొన్నారు. ఎంత లాభం రావచ్చు అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాత  ఎన్‌.వి.ప్ర‌సాద్ కేవ‌లం రూ.2 కోట్ల‌ పెట్టి తీసుకున్నారు. అలాగే ఈ రైట్స్ లో  శాటిలైట్ హ‌క్కుల‌ు కూడా కలిసి ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు బజ్ లేదు. అసలు సినిమా ఆడుతుందో లేదో తెలియదు. అందుకే బేరం ఆడి మరీ అంత తక్కువకు తీసుకున్నారు. విజయ్ సేతపతి హీరో కాబట్టి బాగా తక్కువకే ఇచ్చారు. అయితే ఈ సినిమా ఇప్పుడు లాభాల పండ పండిస్తోంది. 

కేవలం  థియేట్రిక‌ల్ నుంచే రూ.5 కోట్ల వ‌ర‌కూ రావొచ్చ‌ని లెక్కలు వేపస్తన్నారు.  నైజాం నుంచే రూ.2 కోట్లు రావొచ్చు అంటున్నారు. ఇంత పెద్ద హిట్ అయ్యింది కాబట్టి శాటిలైట్ క‌నీసంలో కనీసం  రూ.3 కోట్లు వస్తాయనుకున్నా రూ.8 కోట్ల లెక్క తేలుతోంది. అంటే.. ఆరు  కోట్ల లాభం అనే చెప్పాలి. ఇది అసలు ఎవరూ ఊహించని మొత్తం. ఇప్పుడు ఈ సక్సెస్ చూసి తమిళ డబ్బింగ్ సినిమాలు వరస పెట్టి దూకుతాయనటంలో సందేహం లేదు. 
   

చిత్రం కథేంటి?
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్‌లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష‍్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష‍్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష‍్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios