సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకటే ఒక టాపిక్ వైరల్ గా మారింది. సర్కార్ సినిమా వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. తమిళనాడు అధికార పార్టీ నాయకులను కించే పరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడైన మురగదాస్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. 

ఇకపోతే మరోవైపు చిత్ర కథానాయకుడు విజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయాన్నే జనాలు పరిసర ప్రాంతాల్లో గుంపులుగా ఉండటంతో పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేశారు. అధికార పార్టీ నేతలు చిత్ర యూనిట్ సభ్యులపైన దాడి చేసే అవకాశం ఉందనే టాక్ కూడా వస్తోంది. 

ఇకపోతే విజయ్ తన రాజకీయ అడుగుల కోసం సినిమాను కావాలని తెరకెక్కించాడని దివంగత ముఖ్యమంత్రి జయలలితను కావాలనే తప్పుగా చూపించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇక కోర్టు వరకు మ్యాటర్ సీరియస్ అవ్వకముందే మురగదాస్ ముందస్తు బెయిల్ కు ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం.