‘సలార్’ విడుదల సమయంలోనే ‘డుంకీ’, ‘అక్వామ్యాన్’ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయినా, రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు. అలాగే ఈ మధ్యన  ప్రభాస్‌  మూవీస్ కొన్ని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. 


దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ప్రభాస్ తాజా చిత్రం సలార్ . క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ చిత్రాన్నిప్రశాంత్‌ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు పోటీగా అటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకీ’ , హాలీవుడ్ నుంచి ‘అక్వామ్యాన్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా థియేటర్స్ సమస్య వస్తుంది. నార్త్ బెల్త్ మొత్తం షారూఖ్ క్రేజ్ తో ‘డుంకీ’ ఆక్రమిస్తే... ఓవర్ సీస్ లో ‘అక్వామ్యాన్’దే పై చేయి. ఈ నేపధ్యంలో థియేటర్స్ ఎలా మేనేజ్ చేస్తారనే విషయమై ‘సలార్’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘సలార్’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ... “గత దశాబ్దకాలంగా సినిమాలను ఒకే పద్దతిలో విడుదల చేస్తున్నాం. ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగానే పోస్ట్ ఫోన్ అయ్యి ఇప్పుడు వస్తోంది. ఇక ‘సలార్’ విడుదల సమయంలోనే ‘డుంకీ’, ‘అక్వామ్యాన్’ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయినా, రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు. అలాగే ఈ మధ్యన ప్రభాస్‌ మూవీస్ కొన్ని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే నిర్మాతగా గత చిత్రాలతో ఈ సినిమాను పోల్చి చూడలేను. సినిమాకు స్టోరీనే కీలకంగా భావిస్తాను. ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాను. ప్రభాస్‌ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలాగే ఉండబోతున్నాయి” అని చెప్పారు.

అలాగే “’సలార్’, ‘డుంకీ’ విషయంలో హెల్దీ కాంపిటీషన్ ఉండాలని భావిస్తున్నాను. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటీర్స్ తో చర్చలు జరుపుతున్నాం. మా సినిమాలను సోలోగా విడుదల చేసినప్పుడు, ఆక్యుపెన్సీ 60-70% ఉంటుంది. కానీ, ఇప్పుడు కొన్ని స్క్రీన్లు ‘ఆక్వామ్యాన్‌’కి వెళ్తాయి. ‘సలార్’, ‘డుంకీ’ సినిమాల విషయంలో 50-50 స్క్రీన్లను ఉండాలని మేం భావిస్తున్నాం. ఈ రెండు సినిమాలు 90-100% ఆక్యుపెన్సీని సాధిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ‘సలార్’ సోలోగా విడుదలైతే దొరికే దానికంటే స్క్రీన్లు తక్కువగా వచ్చినప్పటికీ, ఎక్కువ ఆక్యుపెన్సీని పొందేలా ప్లాన్ చేస్తున్నాము. ఓవర్సీస్‌లో కూడా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి తగాదాలు,విభేధాలకు తావు లేకుండా #Salaarని బరిలోకి దిపేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు.