సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విజయ్. ప్రతి సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. అంతే కాకుండా ఓ మంచి సోషల్ మెస్సేజ్ ఉండే కథలను కూడా విజయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విజయ్. ప్రతి సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. అంతే కాకుండా ఓ మంచి సోషల్ మెస్సేజ్ ఉండే కథలను కూడా విజయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇటీవల మురగదాస్ తో చేసిన సర్కార్ 200 కోట్లను ఈజీగా దాటేసింది.
అందులో బిజినెస్ మెన్ గానే కాకుండా సాధారణ బాధ్యత గల వ్యక్తిగా విజయ్ నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక నెక్స్ట్ ఒక ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో చేస్తోన్న మూడో సినిమా మంచి సందేశంతో తెరకెక్కుతోంది. ఆ సినిమా సెకండ్ హాఫ్ లో హెవీ ఎమోషన్ ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విజయ్ మొదటి సారి ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సినిమాలో హైలెట్ పాయింట్ అని టాక్. మరి మూడవసారి కలుస్తున్న అట్లీ - విజయ్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి.
