ఈ మధ్యన టాలీవుడ్ స్టార్స్ ప్రయోగాలు చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఆ మధ్యన రామ్ చరణ్ ..బధిరుడుగా రంగస్దలం చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత రవితేజ..రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడుగా కనిపించి అలరించారు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ..నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించారు. ఇలాంటి పాత్రలతో తమలో ఉన్న నటనను మరింతగా బయిటపెట్టడానికి వీలుంటుందని దర్శకులు, హీరోలు భావించటమే ప్లస్ అవుతోంది. అదే కోవలో ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. 

రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టుని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం.  టిపికల్ మాస్ ఎంటర్టైనర్ గా  ఈసినిమా రూపొందబోతోంది. పూరి ఎప్పుడైతే స్క్రిప్టు పూర్తి చేసి ఓకే అనిపించుకుంటారో అప్పుడే సినిమా పట్టాలు ఎక్కనుంది.  అయితే ఈ చిత్రాన్ని ఏ బ్యానర్‌లో చేయాలనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనితెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలీజ్ కు ముందు వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకున్నాడు. 

ఎగ్రిమెంట్ ప్రకారం వారితోనే ముందుగా సినిమా చేయాలి. దాంతో విజయ్‌ దేవరకొండ ఒప్పుకున్న నిర్మాతకి పూరి సినిమా చేయాల్సి వుంటుంది. కానీ పూరి జగన్నాధ్‌ మాత్రం ఇప్పుడు బయటి బ్యానర్‌లో ఇష్టపడటం లేదట. ఈ విషయంలోనే తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం.